ధ్రువపత్రాలు తీసుకోండిలా.. | - | Sakshi
Sakshi News home page

ధ్రువపత్రాలు తీసుకోండిలా..

Feb 27 2026 7:46 AM | Updated on Feb 27 2026 7:46 AM

ధ్రువపత్రాలు తీసుకోండిలా..

ధ్రువపత్రాలు తీసుకోండిలా..

పారదర్శంగా అందిస్తున్నాం

జ్యోతినగర్‌(రామగుండం): ప్రస్తుత విద్యా సంవత్సరంలో పది, ఇంటర్‌, డిగ్రీ వార్షిక పరీక్షలకు సమయం ఆసన్నమైంది. వీటితోపాటు ఆయా కోర్సుల్లో చేరేందుకు ప్రవేశ పరీక్షల తేదీలూ విడుదలయ్యాయి. ఈ సమయంలో విద్యార్ధులు ఉన్నత చదువుల కోసం సంబంధిత ధ్రువీకరణపత్రాల అవసరం ఉంటుంది. ఇందుకోసం ముందస్తుగా కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా అవసరం ఉంటుంది. దేశవ్యాప్తంగా నిర్వహించే నీట్‌, జేఈఈ మెయిన్స్‌ అర్హత సాధించిన వారికి ఓబీసీ, నాన్‌ క్రీమీలేయర్‌. పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రాలు కావాల్సి ఉంటుంది. ఈ పత్రాలు సరైన సమయంలో పొందగలిగితే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. లేకుంటే సమయానికి అవస్థలు పడాల్సి వస్తుంది.

పది, ఇంటర్‌, డిగ్రీ విద్యార్థులకు..

పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్ధులు ముఖ్యంగా ఇంటర్మీడియట్‌లో చేరడానికి ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుకున్నట్లు బోనఫైడ్‌ సర్టిఫికెట్లు తీసుకోవాలి. ఏదైనా తరగతి చదవకుండా ఉంటే ఆ తరగతి గ్యాప్‌ సర్టిఫికెట్‌ తీసుకోవాల్సి ఉంటుంది.

ఓబీసీ, నాన్‌ క్రీమీలేయర్‌, ఈడబ్ల్యూఎస్‌..

దేశవ్యాప్తంగా నీట్‌, జేఈఈ విద్యార్థులకు సర్టిఫికెట్లు తప్పనిసరిగా అవసరం. వీటిని పొందేందుకు మీసేవలో దరఖాస్తు చేసుకోవాలి. కుల ధ్రువీకరణపత్రం, రేషన్‌కార్డు, పదో తరగతి మెమో, భూమిపత్రాల నకలు, అఫిడవిట్‌ సమర్పించి దరఖాస్తు చేసుకుంటే ధ్రువీకరణ పత్రాలు లభిస్తాయి.

కుల, ఆదాయ ధ్రువీకరణ..

కుల, ఆదాయ సర్టీణికెట్లు పొందాలంటే.. మీ సేవ కేంద్రంలో దరఖాస్తు చేయాలి. వాటికోసం విద్యార్థి ఆధార్‌కార్డు, రేషన్‌ కార్డు, కులధ్రువీకరణ పత్రం(ఇంట్లో ఎవరిదైనా) ఉండాలి. లేదంటే అఫిడవిట్‌ సమర్పించాల్సి ఉంటుంది. గతంలో తీసుకున్న కుల ధ్రువీకరణ పత్రం ఉంటే వెంటనే కొత్త సర్టిఫికెట్‌ తీసుకోవచ్చు.

గ్యాప్‌ సర్టిఫికెట్‌..

ఏదైనా తరగతి చదవకుండా ఉండి సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ రోజులైతే విద్యార్థులకు గ్యాప్‌ సర్టిఫికెట్‌ అవసరమవుతుంది. దీనికోసం మీసేవ కేంద్రంలో తొలుత పోలీసు వెరిఫికేషన్‌ పొందాల్సి ఉంటుంది. అనంతరం ఏయే తరగతి ఎక్కడ చదివారో తరగతి బోనఫైడ్‌ సర్టిఫికెట్లు సమర్పించి మీ సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలి.

విద్యార్థులకు కొత్త సర్టిఫికెట్లను అందించడంతో పారదర్శకంగా వ్యవహరిస్తున్నాం. దరఖాస్తులను పరిశీలించిన అనంతరం మంజూరు చేస్తున్నాం. కొత్త సర్టిపికెట్లను పొందేవారు నేరుగా కార్యాలయానికి వచ్చి పత్రాలను పొందవచ్చు. మధ్యవర్తులను ఆశ్రయించవద్దు.

– శ్రీపాద ఈశ్వర్‌, తహసీల్దార్‌, రామగుండం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement