ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

Feb 27 2026 7:46 AM | Updated on Feb 27 2026 7:46 AM

ఉరేసు

ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

జగిత్యాలక్రైం: జగిత్యాలరూరల్‌ మండలం లక్ష్మీపూర్‌లో గర్వందుల మహేశ్‌(37) అనే వ్యక్తి బుధవారం రాత్రి ఆర్థిక ఇబ్బందులతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహేశ్‌ కొన్నేళ్లుగా అప్పులు చేసి ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌, మరో మూడు చోట్ల వ్యాపారాలు ప్రారంభించాడు. వ్యాపారం కోసం చేసిన అప్పులు ఎలా కట్టాలో బాధపడుతూ మనస్తాపానికి గురై బుధవారం రాత్రి ఇంటి నుంచి వెళ్లి గ్రామశివారులోని రైతు వేదిక వద్ద ఇనుప పైపునకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య జమున ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉమాసాగర్‌ తెలిపారు. కాగా, మృతుడు ఆన్‌లైన్‌ గేమింగ్‌లు ఆడి ఆర్థికంగా అప్పుల పాలైనట్లు గ్రామస్తులు తెలిపారు.

స్కూల్‌ బస్సును ఢీకొని వ్యక్తి మృతి

రాయికల్‌: రాయికల్‌ మండలం రామాజీపేట గ్రామశివారులో గురువారం స్కూల్‌ వ్యాన్‌ను ఢీకొని ఉల్లూరి మధు(35) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందినట్లు ఎస్సై సుధీర్‌రావు తెలిపారు. మల్లాపూర్‌ మండలం గుండంపల్లికి చెందిన ఉల్లూరి మధు భూపతిపూర్‌లో తన బంధువుల ఇంటి వద్ద శుభకార్యానికి హాజరై తిరిగి ఇంటికి ద్విచక్రవాహనంపై అతివేగంగా వెళ్తుండగా రాయికల్‌ నుంచి ఓ ప్రైవేటు స్కూల్‌కు చెందిన బస్సు రామాజీపేట వైపు వెళ్తుండగా ఢీకొనడంతో తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. స్కూల్‌ బస్సు డ్రైవర్‌ ప్రకాశ్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

కేసీ కెనాల్‌లో మృతదేహం లభ్యం

హుజూరాబాద్‌: పట్టణ శివారులోని కాకతీయ కెనాల్‌లో గురువారం మృతదేహం లభ్యమైనది. మృతదేహం నీటిలో కొట్టుకుపోతుండగా గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు నీటి ప్రవాహాన్ని తగ్గించగా మృతదేహం హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి శివారులో లభ్యమైంది. మృతుడు మండలంలోని పెద్దపాపయ్యపల్లి గ్రామానికి చెందిన పల్లకొండ గణేశ్‌గా గుర్తించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య1
1/1

ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement