సర్వే ముగిసింది.. లెక్క తేలింది
పెద్దపల్లి: కుష్ఠును సమూలంగా నిర్మించడం లక్ష్యంగా కేంద్రప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. అందులో భాగంగా గతనెల 18 నుంచి 31వ తేదీ వరకు జిల్లాలోని వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ఈమేరకు జిల్లా అధికారులు ఎల్‌సీడీసీ(లెప్రసీ కేస్ డిటెక్టివ్ క్యాంపెయిన్) నిర్వహించారు. ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎం ఇంటింటా పర్యటించారు. అనుమానితులను గుర్తించగా.. డాక్టర్లు వారిని పరీక్షించనున్నారు.
అనుమానితులు
జిల్లాలో 18 ప్రాథమిక, 7 అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో సర్వే చేశారు. గతనెల 18న ప్రారంభించిన సర్వేలో 458 మంది ఆశ వర్కర్లు పాల్గొని రోజువారీ నివేదికలు రూపొందించారు. అర్బన్ ప్రాథమిక, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ఏఎన్‌ఎంలు ఆ నివేదికలను జిల్లా అధికారులకు సమర్పించారు. ఉదయం 7 నుంచి ఉదయం 9 గంటల వరకు సర్వే చేయగా.. ప్రతీ ఆశకార్యకర్త రోజుకు కనీసం 25 ఇళ్లు సందర్శించారు. ఇళ్లలో నివాసం ఉంటున్న వారిని పరిశీలించారు.
జిల్లాలో కుష్ఠు అనుమానితుల సంఖ్య 1,163 సర్వే చేసిన నివాసాలు 1,83,777


