నోటీసులు ఇవ్వకుండా కూల్చుతారా?
రామగిరి(మంథని): ముందస్తు సమాచారం ఇవ్వకుండా, నోటీసులు జారీచేయకుండానే తమ ఇళ్లను కూల్చివేశారని బుధవారంపేట పంచాయతీ పరిధిలోని సిద్దపల్లివాసులు మంగళవారం ఆందోళనకు దిగారు. ఓసీపీ–2 విస్తరణ కోసం సింగరేణి భూసేకరణ ప్రారంభించింది. దీంతో కొద్దిరోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. మంగళవారం కలెక్టర్ పర్యటనకు రాగా.. రెవెన్యూ, సింగరేణి అధికారుల స మక్షంలో అక్రమంగా నిర్మించిన ఇళ్ల కూల్చివేత చేపట్టారు. తమ భూముల్లో ఇళ్లు నిర్మించుకుంటే అక్ర మ కట్టడాలు ఎలా అవుతాయని గ్రామస్తులు ప్ర శ్నించారు. పెద్దపల్లి – మంథని ప్రదాన రహదారిపై బైఠాయించారు. కలెక్టర్ అక్కడే ఉండి స్వయంగా కూల్చివేతకు ఆదేశాలు ఇచ్చారని ఆరోపించారు. ఆయన సమాధానం చెప్పేవరకూ ఆందోళన విర మించేది లేదని ఆందోళనకారులు భీష్మించుకు కూ ర్చున్నారు. సుమారు 3 గంటల పాటు గ్రామస్తులు ఆందోళన చేశారు. గోదావరిఖని ఏసీపీ రమేశ్ సంఘటన స్థలానికి చేరుకుని గ్రామస్తులతో చర్చించారు. సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని ఆయన హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళనను విరమించారు.
ఆగ్రహించిన గ్రామస్తులు
రోడ్డుపై బైఠాయించి నిరసన


