క్యాన్సర్‌పై హెచ్‌పీవీ టీకా
పెద్దపల్లి: మహిళల్లో ఎక్కువగా వస్తున్న గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్‌ను శాశ్వతంగా నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా 14 ఏళ్లలోపు కిశోర బాలికలకు ఉచితంగా హెచ్‌పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) వ్యాక్సిన్ పంపిణీకి ప్రణాళిక రూపొందించింది. దీనిపై వచ్చిన ఉత్తర్వుల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తగిన కార్యాచరణకు సన్నద్ధం అవుతున్నారు. ఎంపిక చేసిన వైద్యులను బెంగుళూర్‌లో శిక్షణకు పంపించారు. వ్యాక్సిన్ వేసే విధానం, నిల్వ చేసే పద్ధతి తదితర అంశాలను గుర్తించి కేంద్రం ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. ఒకరికి ఒక వ్యాక్సిన్ ఖరీదు సుమారు రూ.10 వేల వరకు ఉంటుందని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
శిక్షణ పూర్తి..
జిల్లాలోని 18 ప్రాథమిక, 7 అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్, గోదావరిఖని వైద్య విధాన పరిషత్‌లో పనిచేస్తున్న డాక్టర్లు, ఏఎన్‌ఎం, ఫార్మసిస్టులు, సూపర్‌వైజర్లు, ఆశ, ఎంఎల్‌హెచ్‌పీ లకు గత నెలలో శిక్షణ ఇచ్చామని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ కృష్ణకుమార్ తెలిపారు. సర్వేకల్ (గర్భాశయ ముఖద్వార) క్యాన్సర్ ఎలా వస్తుంది, దానికి గల కారణాలు.. నివారణకు వ్యాక్సిన్ ఏ విధంగా పనిచేస్తుందో వివరిస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో శిక్షణ పొందిన ఉద్యోగులందరూ కిషోర్ బాలికల వివరాలు సేకరిస్తున్నారు. జిల్లాలో 14 సంవత్సరాల లోపు వయసు కలిగిన కిశోర బాలికలు సుమారు 8,000 మంది ఉంటారని అధికారులు తెలిపారు
కిశోర బాలికలకు ఉచితంగా వ్యాక్సిన్


