రూ.కోటితో సమ్మక్క జాతరకు రోడ్డు నిర్మాణం
● ఎమ్మెల్యే విజయరమణారావు
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం హనుమంతునిపేటలో సమ్మక్కసారలమ్మ జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం రూ.కోటి నిధులతో తారురోడ్డు నిర్మాణం చేపట్టినట్లు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు పేర్కొన్నారు. ఆదివారం గ్రామంలో సర్పంచు మ్యాడగోని శ్రీనివాస్‌తో కలిసి పనులు ప్రారంభించారు. కాసులపల్లెలో హకా కేంద్రాన్ని ప్రారంభించారు. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కూర మల్లారెడ్డి, సర్పంచ్ నల్లగొండ కుమార్, నాయకులు తిరుపతిరెడ్డి, సంపత్‌రావు, మేకల కుమార్, పోల్సాని సుధాకర్‌రావు పాల్గొన్నారు.
రూ.35 లక్షలతో సీసీ రోడ్డు పనులు..
పెద్దపల్లి: సుల్తానాబాద్ పట్టణంలోని స్వప్నకాలనీలో రూ.35 లక్షలతో నిర్మించే సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే విజయ రమణారావు ఆది వారం ప్రారంభించారు. సుల్తానాబాద్ రూపురేఖలు మార్చేందుకు రూ.15 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని వివరించారు. కాంగ్రెస్ నాయకులు, రైస్ మిల్లర్స్ పాల్గొన్నారు.
విజ్ఞానయాత్రలో విద్యార్థులు
ఓదెల(పెద్దపల్లి): మండలంలోని హరిపురం ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు ఆదివారం విజ్ఞానయాత్రకు తరలివెళ్లారు. హెచ్‌ఎం మహేందర్‌రెడ్డి, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో బాసరలోని జ్ఞానసరస్వతి ఆలయం, కోరుట్ల సాయిబాబా ఆలయం, అభిసాగర్ సరస్సు, శ్రీరాంసాగర్ ప్రాజెక్టును సందర్శించారు.
7న వైద్యుల భర్తీకి ఇంటర్వ్యూ
పెద్దపలి: ప్రభుత్వ ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న వైద్య పోస్టుల భర్తీకి ఈనెల 7న ఉదయం 11 గంటలకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.శ్రీధర్ తెలిపారు. జిల్లాలోని తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న పీడియాట్రిక్, ఆప్తామాలజిస్ట్, రేడియాలజీ, సివిల్ అసిస్టెంట్ సర్జన్ (ఎంబీబీఎస్), జనరల్ మెడిసిన్ పోస్టులను కాంట్రాక్ట్ ప్రతిపాదికన భర్తీ చేస్తామని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు బయోడేటాతో పాటు విద్యార్హతల సర్టిఫికెట్ల జిరాక్స్ ప్రతులు ఒక సెట్‌తో హాజరు కావాలన్నారు. సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టులకు నెలకు రూ.లక్ష, సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు నెలకు రూ.52,351 వేతనం ఉంటుందన్నారు. ఇతర వివరాలకు 84990 61999, 94924 57809 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.


