రోడ్డు డ్యామ్‌పైకి ఎస్సారెస్పీ నీరు
పెద్దపల్లిరూరల్: పట్టణ శివారులోని ఎస్సారెస్పీ డీ– 83 ప్రధాన కాలువలోకి వచ్చిన ఎస్సారెస్సీ సాగునీటి ఉధృతికి విద్యుత్ మోటార్లు కొట్టుకుపోయా యి. ఎగువన ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ఆ నీరు గు రువారం జిల్లాకు చేరింది. అయితే, డీ – 83 ప్రధాన కాలువ ద్వారా సబ్బితం శివారు నుంచి గుండారం రిజర్వాయర్‌కు చేరే కాలువలో కొందరు రైతులు సా గునీటి కోసం అమర్చుకున్న విద్యుత్ మోటార్లు కొ ట్టుకుపోయాయి. నీటి ప్రవాహం ఉధృతంగా రావడంతో సబ్బితం, గట్టుసింగారం ప్రాంతాల్లోని లెవ ల్ కాజ్‌వే పూర్తిగా ఎస్సారెస్పీ నీటిప్రవాహంలో ము నిగిపోయింది. ఈమార్గంలో రాకపోకలు సాగించ డం కష్టంగా మారిందని రైతులు చుంచు చందు, మల్లయ్య, రవిందర్, గట్టయ్య, సారయ్య, నాగరాజు, మహేందర్ తదితరులు వాపోయారు. ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని కోరారు. సబ్బితం రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందిని ఎమ్మెల్యే విజయరమణారావు దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కస్తానని సర్పంచ్ నూనె సరోజన తెలిపారు.


