కార్పొరేషన్ ఎన్నికలకు సన్నద్ధం
యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేయాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. స్థానిక టీబీజీకేఎస్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన పార్టీ శ్రేణుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టాలని సూచించారు. బీఆర్‌ఎస్ గెలుపుకోసం కార్యకర్తలు, నాయకులు సైనికుల్లా పనిచేయాలని ఆయన కోరారు. సమావేశంలో నాయకులు మేడి సదయ్య, కిషన్‌రెడ్డి, స్టాలిన్‌గౌడ్, బాదె అంజలీదేవి, పులి రాకేశ్, రాంచందర్, నారాయణదాసు, కుమార్ నాయక్, ముత్యాల గౌడ్, మొగిలి, రాజమౌళి, బాలరాజు, సుజాత, స్వరూప, రోజా, రవి తదితరులు పాల్గొన్నారు.


