24న ఎస్సారెస్పీ నీటి విడుదల
పెద్దపల్లిరూరల్: యాసంగి పంటలకు ఎస్సారెస్పీ ద్వారా ‘వారబందీ’ పద్ధతిన ఈనెల 24 న సాగునీటిని విడుదల చేయనున్నారు. నిజామాబాద్ జిల్లా పోచంపాడ్ ప్రాజెక్టులో గేట్లు ఎత్తడంతో సరఫరా అయ్యే నీటిని తొలుత జ గిత్యాలకు సరఫరా చేస్తారని తెలిసింది. ఆ త ర్వాత పెద్దపల్లి జిల్లాకు చేరే అవకాశం ఉంది. వరి సాగుచేసే రైతులు ఇప్పటికే నారు పోసినా.. చలితీవ్రతతో తెగుళ్లు ఆశించి నారు పా డైందని రైతులు వాపోయారు. కొన్ని ప్రాంతా ల్లో మళ్లీ నారుపోయాల్సి వస్తోందని అంటు న్నారు. ఈసందర్భంగా నీటి పారుదల శాఖ ఈఈ శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈనెల 24 పో చంపాడ్ వద్ద గేట్లు ఎత్తినా పెద్దపల్లి జిల్లాకు జ నవరి 2వ తేదీ వరకు సాగునీరు చేరే అవకా శం ఉందన్నారు. వారబందీ పద్ధతిన వచ్చే నీ టిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
వడ్ల కల్లాలపై వానరాలు
మంథనిరూరల్: గ్రామాల్లో కోతులు బీభత్సం సృష్టిస్తున్నాయి. గుంపులుగా స్వైరవిహారం చే స్తున్నాయి. కూరగాయాల తోటలను ధ్వంసం చేస్తున్న వానరాలు.. ఆఖరుకు వడ్ల కల్లాల్లో ఆ రబోసిన ధాన్యంపై దాడులు చేస్తున్నాయి. క ల్లాల్లో తిరుగుతూ వడ్లను తింటూ చిందరవందర చేస్తూ రైతులకు నష్టం కలిగిస్తున్నాయి. ధాన్యం కొనుగోళ్లు కొంత ఆలస్యం కావడంతో అటవీ ప్రాంతాల్లోని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలపై ఇలా కోతుల గుంపులు దాడులు చేస్తున్నాయి. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయడంతోపాటు కోతులను తరలించేలా అధికారులు చర్యలు తీసుకోవాలంటున్నారు.
పోరు ముగిసె.. పోస్టర్ తొలగే
పెద్దపల్లిరూరల్: పంచాయతీ ఎన్నికల సంగ్రా మం ముగిసింది. ఈసారి పంచాయతీ పోరు అసెంబ్లీ ఎన్నికలను తలపించింది. సర్పంచ్ స్థానాలకు పోటీపడ్డవారు తమ గుర్తు ఓటర్లకు తెలిసేలా ప్రచార పోస్టర్లను ముద్రించి ప్రధా న కూడళ్లు, గోడలపై అంటించారు. ఎన్నికలు ముగియడంతో ఆ పోస్టర్లను తొలగించే పను ల్లో పంచాయతీ సిబ్బంది నిమగ్నమయ్యారు.
మల్యాలపల్లికి చేరిన పులి!
రామగుండం: సుమా రు ఆరురోజుల క్రితం మేడిపల్లి ఓసీపీ పరిసరాలు, గోదావరి తీరంలో సంచరించిన పెద్ద పులి.. శుక్రవారం మ ల్యాలపల్లి గ్రామ శివారులో ప్రత్యక్షమైనట్లు గ్రామస్తురాలు కత్తెరమ ల్ల కుమారి తెలియజేసింది. మేతకోసం తన మేకలను సమీపంలోని బీపీఎల్ స్థలంలోని అడవిలోకి తీసుకెళ్లింది. పులి అరుపులతో మే కలు బెదిరి వెనక్కి పరిగెత్తి వచ్చాయి. అటుగా వెళ్లిన మహిళకు కూడా పులి కనిపించింది. భ యాంళోనలకు గురైన ఆమె ప్రాణభయంతో కేకలు వేస్తూ గ్రామంలోకి పరుగులు పెట్టింది. సమాచారం అందుకున్న ఫారెస్టు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయగా.. పులి అడుగులు కనిపించాయి. రెండ్రోజుల క్రితం లింగాపూర్ గోదావరి శివారు, మేడిపల్లి, పాములపేటలో సంచరించిన పులి.. రామగుండం నడిబొడ్డులోని బీపీఎల్ ప్రాంతంలోకి రావ డం ఆందోళన, ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
‘సింగరేణి వేడుకలపై వివక్ష’
యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): రాష్ట్రప్ర భుత్వం కోల్‌బెల్ట్ ఏరియాల్లో చేపట్టే ప్రతీ కార్యక్రమానికి అవసరమైన నిధులు సమకూర్చుతున్న సింగరేణి.. తన ఆవిర్భావ వేడుకలపై వివక్ష చూపడం సరికాదని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి అన్నారు. ఈనెల 23న చేపట్టే ఆవిర్బావ వేడుకలను గ తంలో మాదిరిగానే వైభవంగా నిర్వహించాలన్నారు. స్థానిక ప్రెస్‌భవన్‌లో శుక్రవారం ఆ యన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వేడుకలకు గతంలో రూ. 41లక్షలు ఖర్చుచేసి న సింగరేణి.. ప్రస్తుతం రూ.8లక్షలకు కుదించడం శోచనీయమన్నారు. నాయకులు రా మ్ముర్తి, రవి, కొమురయ్య, ప్రభాకర్‌రెడ్డి, సతీశ్, శశాంక్, శ్రీనివాస్‌రెడ్డి, అనిల్‌రెడ్డి, హరిప్రసాద్, రమేశ్ తదితరులు పాల్గొ న్నారు.
24న ఎస్సారెస్పీ నీటి విడుదల
24న ఎస్సారెస్పీ నీటి విడుదల


