చెక్‌డ్యాం పరిశీలన
మంథనిరూరల్: రెండ్రోజుల క్రితం కూలిపోయిన అడవిసోమన్‌పల్లి మానేరు చెక్‌డ్యాంను ఇరిగేషన్ అధికారులు శుక్రవారం పరిశీలించారు. దీనిపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరిగేషన్ సీఈ శ్రీనివాసరావు గుప్త, ఎస్‌ఈ శ్రీనివాసచారితో కలిసి పరిశీలించారు. చెక్‌డ్యాం గోడలు కూలిపోయిన తీరుపై అనుమానం వ్యక్తం చేశారు. గతంలో వరద ఉధృతితోపాటు రెండురోజుల క్రితం వరకు ఎంతమేర నీరు నిలిచి ఉందనే విషయంపైనా వారు ఆరా తీశారు. ప్రస్తుత వరద తాకిడికి కూలిపోయే అవకాశం ఏ మాత్రం లేదని అధికారులు వివరించారు. ఈఈ బలరామయ్య, డీఈ రమేశ్‌బాబు, ఏఈఈ నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.


