రోజూ చేపలు పట్టుకునే వాళ్లం
చెక్‌డ్యాం నిర్మించాక చేపలు పట్టుకోవడం మొదలు పెట్టాం. మూడేళ్లుగా పదిహేను మందిమి కలిసి క్వింటాల్ వరకు చేపలు పట్టేవాళ్లం. రోజూ సుమారు రూ.800 నుంచి రూ.1,000 వరకు సంపాదించుకునేటోన్ని. చెక్‌డ్యాం కూలిపోవడంతో ఉపాధి పోయింది.
– కొటారి సమ్మయ్య, మత్స్యకారుడు
సాయంత్రం పోయే సరికే..
పొద్దుగాల చేపలు పట్టుకుని ఇంటికి పోయా. సాయంత్రం మళ్లా చెక్‌డ్యాం వద్దకు వచ్చేసరికి కూలిపోయి ఉంది. చెక్‌డ్యాంతో ఎంతోమందికి ఉపాధి దొరికింది. ఉదయం, సాయంత్రం వేళలో చేపలు పట్టుకునేవాళ్లం. ఇప్పుడు కూలిపోయి నీళ్లన్నీ వృథాగా పోతున్నయ్. మేము సైతం ఉపాధి కోల్పోయాం.
– అనపర్తి శంకర్, మత్స్యకారుడు
రోజూ చేపలు పట్టుకునే వాళ్లం


