ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యం
● పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): ప్రజాసమస్యల పరిష్కారంలో సర్పంచులదే ప్రధాన భూమిక కా వాలని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. మీర్జంపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ పోచాల శైలజ– సదానందంలను ఎమ్మెల్యే స్వగృహంలో శుక్రవారం సన్మానించి అభినందించారు. ఆయన మాట్లాడుతూ, ప్రజలకు అందుబాటులో ఉండి అధికారుల సమన్వయంతో గ్రామాభివృద్ధికి పాటుపడాలని సూచించారు. మాజీ ఎంపీపీ సారయ్యగౌడ్, వార్డు సభ్యులు బండ మల్లారెడ్డి, పుల్లూరి అన్విత, సాగర్ తదితరులు పాల్గొన్నారు.


