మెరిసిన పారిశుధ్య కార్మికుని కొడుకు
వీర్నపల్లి: మండలం గర్జనపల్లికి చెందిన పారిశుధ్య కార్మికుడు గుడిసె చంద్రయ్య–ఎల్లవ్వ దంపతుల రెండో కొడుకు గుడిసె రంజిత్‌కుమార్ గ్రూప్–3లో ప్రతిభ చాటారు. ట్రెజరీలో సీనియర్ అకౌంటెంట్‌గా ఎంపికయ్యాడు. రంజిత్‌కుమార్ 10వ తరగతి వరకు గర్జనపల్లిలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదివాడు. ఇంటర్, బీటెక్ ట్రిపుల్ ఐటీ బాసరలో చదివారు. కరీంనగర్, హైదరాబాద్‌లోని ఎస్సీ స్టడీసర్కిల్‌లో కోచింగ్ తీసుకొని గ్రూప్–3కి ఎంపికయ్యారు. తండ్రి గ్రామపంచాయతీ పారిశుధ్య కార్మికుడు కాగా, తల్లి కూలి పనులు చేస్తుంటుంది.


