రాణించిన రాయికల్ యువకులు
రాయికల్: జగిత్యాల జిల్లా రాయికల్‌కు చెందిన యువకులు సురతాని అరవింద్‌రెడ్డి, భూపతిపూర్‌కు చెందిన బొడ్డుపల్లి విజయ్‌కుమార్ గ్రూప్–3 ఉద్యోగాలు సాధించారు. అరవింద్‌రెడ్డి రాష్ట్రస్థాయిలో 103వ ర్యాంక్ సాధించారు. ట్రెజరీ అండ్ అకౌంట్స్ హెచ్‌వోడీ ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా ఎంపికయ్యారు. రాయికల్‌కు చెందిన సురతాని మల్లారెడ్డి, భాగ్యలక్ష్మి దంపతుల కుమారుడు. మరో యువకుడు భూపతిపూర్‌కు చెందిన బొడ్డుపల్లి విజయ్‌కుమార్ వస్తాపూర్ కార్యదర్శిగా పనిచేస్తూనే గ్రూప్–3లో ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌కు సీనియర్ అకౌంటెంట్‌గా ఎంపికయ్యారు. బొడ్డుపల్లి విజయ్‌కుమార్ చిన్నతనంలోనే తన తండ్రి చనిపోగా తల్లి గంగరాజు బీడీలు చుడుతూ చదివించింది. విద్యాభ్యాసం మొత్తం ప్రభుత్వ సంస్థల్లోనే పూర్తి చేశారు. ఆర్‌ఆర్‌బీ, గ్రూప్–4 ఉద్యోగాలు సైతం వచ్చాయి.
సురతాని అరవింద్‌రెడ్డి
బొడ్డుపల్లి విజయ్‌కుమార్
రాణించిన రాయికల్ యువకులు


