విచారణకే పరిమితమా..!
ఖాదీ ప్రతిష్టాన్‌లో అక్రమాలు జరిగాయని ప్రభుత్వానికి ఫిర్యాదు ఐదు నెలల క్రితం విజిలెన్స్ విచారణ ఇప్పటికీ బహిర్గతం కాని నిజాలు
మెట్‌పల్లి ఖాదీ ప్రతిష్టాన్‌కు పలు ప్రాంతాల్లో భూములు ఉన్నాయి. ఇందులో పూడూరు, కిసాన్‌నగర్‌లో ఉన్న స్థలాలను విక్రయించారు. అయితే వీటిని పాలకవర్గంలోని ముఖ్యులు తక్కువ ధరకు అమ్మి లబ్ధి పొందారనే విమర్శలు వ్యక్తమయ్యాయి.
మెట్‌పల్లి పట్టణంలో ఖాదీకి చెందిన స్థలంలో సుమారు 200 గదులతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించారు. దీనికి మున్సిపల్ నుంచి ఎలాంటి అనుమతులు పొందలేదు. అలాగే ఆస్తి పన్ను కూడా చెల్లించడం లేదు.
వీటితో పాటు మున్సిపల్ అధికారులు సమీకృత మార్కెట్ నిర్మాణం కోసం ఖాదీకి చెందిన 20గుంటల స్థలాన్ని 2021 మార్చిలో లీజుకు తీసుకున్నారు.
అప్పుడు చేపట్టిన ఈ పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. కానీ, 2022 ఏప్రిల్ నుంచి ఖాదీకి అద్దె చెల్లించేలా ఒప్పందం జరిగింది.
వీటి విషయంలో అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం వల్ల మున్సిపాల్టీకి రూ.లక్షల్లో నష్టం ఏర్పడింది. దీనికి ఖాదీ పాలకవర్గంలోని ముఖ్యుల ఒత్తిడి ఉందనే ఆరోపణలు ఉన్నాయి.
ఖాదీలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు చేస్తూ గతంలో బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఆందోళనలు చేపట్టారు. విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కానీ, ఆ సమయంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం దీనిని పట్టించుకోలేదు.
రెండేళ్ల క్రితం కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో గత జూలైలో విజిలెన్స్ అధికారులు మెట్‌పల్లికి వచ్చి ప్రతిష్టాన్, మున్సిపల్ కార్యాలయాల్లో విచారణ చేని పలు వివరాలు సేకరించారు.
విజిలెన్స్ అధికారులు విచారణ జరిపి ఐదు నెలలు గడిచింది. ఇప్పటి వరకు ఈ విషయంలో ఎలాంటి పురోగతి లేదు.
వాస్తవానికి ఖాదీ ప్రతిష్టాన్ ఎంతో ఘన కీర్తిని కలిగి ఉంది. దాని పాలకవర్గ సభ్యులు తీసుకున్న కొన్ని నిర్ణయాల్లో పారదర్శకత లోపించడం వల్ల వివాదానికి దారి తీశాయి. ప్రధానంగా అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడం సంస్థ ప్రతిష్టపై తీవ్ర ప్రభావం చూపాయి.
ఈ నేపథ్యంలో విచారణ జరిపిన ప్రభుత్వం.. ఖాదీ పాలకవర్గంపై వచ్చిన ఆరోపణలు నిజమా? కాదా? అన్నది బహిర్గతం చేయాలని ప్రజలు కోరుతున్నారు.
మెట్‌పల్లి ఖాదీ గ్రామోద్యోగ ప్రతిష్టాన్‌లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. దీనికి సంబంధించిన ఆధారాలతో నేరుగా ముఖ్యమంత్రిని కలిసి ఫిర్యాదు చేశాను. తొందరలోనే విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటాం..ఇందులో ఎవరి ప్రమేయం ఉన్నా విడిచిపెట్టే ప్రసక్తే లేదు అని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ప్రారంభంలో నియోజకవర్గానికి చెందిన ఆ పార్టీ ముఖ్య నేత తరచూ ఈ వ్యాఖలు చేశారు. అతను అన్నట్లే..ఆ తర్వాత విజిలెన్స్ విభాగం అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి వెళ్లిపోయారు. ఇది జరిగి ఐదు నెలలు గడిచినా ఇంతవరకు ఈ వ్యవహారంలో ఎలాంటి పురోగతి లేదు. మొదట ఎంతో హడావుడి చేసిన ఆ నేత కూడా ప్రస్తుతం ఖాదీ పేరు తీయడం లేదని కాంగ్రెస్‌లో చర్చ నడుస్తుండడం గమనార్హం.
మెట్‌పల్లి(కోరుట్ల): మెట్‌పల్లి ఖాదీ గ్రామోద్యోగ్ ప్రతిష్టాన్‌లో అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలపై ఇంకా నిజాలు నిగ్గు తేలడం లేదు. ప్రతిష్టాన్ పాలకవర్గ సభ్యులు పలు వ్యవహారాల్లో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారనే విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై గతంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు ఆందోళనలు సైతం నిర్వహించారు. అంతేగాకుండా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ ముఖ్య నేత ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదు చేయగా, వారు విజిలెన్స్ విచారణకు అదేశించారు. దీంతో ఆ విభాగం అధికారులు విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదికను అందజేసినట్లు తెలిసింది.
ఇవే ఆరోపణలు
విజిలెన్స్‌తో విచారణ
కనిపించని పురోగతి


