చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి
మల్యాల(చొప్పదండి): చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు వలలో చిక్కుకొని మృతి చెందిన ఘటన మల్యాల మండలం నూకపల్లిలో జరిగింది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు.. నూకపల్లి గ్రామానికి చెందిన దువ్వాక నర్సయ్య(62) గురువారం మధ్యాహ్నం గ్రామ శివారులోని వరదకాలువలో చేపలు పట్టేందుకు వెళ్లాడు. రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. శుక్రవారం ఎస్సై నరేశ్‌కుమార్ వరదకాలువలో వెతకగా నర్సయ్య వలలో చిక్కుకొని మృతిచెంది ఉన్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
పోక్సో కేసులో ఏడేళ్ల శిక్ష
ధర్మారం(ధర్మపురి): పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికపై అత్యాచారం చేసిన అదే గ్రామానికి చెందిన బొడిగె రాజయ్య(69)కు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష రూ.10వేల జరిమానా విధిస్తూ, బాధితురాలికి రూ.3 లక్షల పరిహారం చెల్లించాలని పెద్దపల్లి జడ్జి స్వప్నరాణి తీర్పు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం.. ఒంటరిగా ఉన్న బాలిక ఇంట్లోకి ప్రవేశించిన రాజయ్య తన ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు అందింది. అప్పటి ఎస్సై అశ్విని కేసు నమోదు చేయగా ఏసీపీ కృష్ణ విచారణ జరిపారు. ఫాస్ట్‌ట్రాక్ అండ్ పోక్సో కోర్టులో వాదోపవాదాల అనంతరం నేరం రుజువు కావడంతో జడ్జి తీర్పు వెలువరించారు.
రోడ్డు వెంట షాపుల కూల్చివేత
కోల్‌సిటీ: గోదావరిఖని గాంధీచౌక్ చౌరస్తాలో రోడ్డు వెంట ఉన్న దుకాణాలను బల్దియా అధికారులు కూల్చివేశారు. షాపింగ్ కాంప్లెక్స్ అభివృద్ధి లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
వీరబుచ్చయ్యకు సన్మానం
పెద్దపల్లి: పంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించడంలో సఫలీకృతమైన డీపీవో, జిల్లా అదనపు ఎన్నికల అధికారి వీరబుచ్చయ్యను ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులు శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఈమేరకు కలెక్టరేట్‌లో ఆయనను కలుసుకున్నారు.
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి


