మంథనిపైనే అందరి దృష్టి
మంథని: ప్రపంచస్థాయి గుర్తింపు పొందిన మంథనిపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఏ ఎన్నికలు జరిగినా ఇక్కడ ప్రజల తీర్పు ఎలా ఉంటుందనే ఉత్కంఠ ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జిల్లాలో మొదటి విడతలో మంథని డివిజన్‌లో జరుగుతున్న ప్రచారతీరు.. ప్రజాస్పందనపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్ కావడంతో ఎన్నికలు ప్రతిష్టాత్మకమయ్యాయి. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల నాయకులు పట్టుగా ఉండడంతో ఇక్కడి గెలుపును ఇరుపార్టీలు చాలెంజ్‌గా తీసుకున్నాయి. పార్టీలతో సంబంధం లేని ఎన్నికలు అయినప్పటికీ ప్రచార తీరులో వ్యూహాలు ఎంచుకుంటున్నారు. ఎవరికి వారే ఓటర్లను ఆకర్షించేలా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. సాధారణ ఎన్నికల్లో అవలంభించిన విధంగా కాంగ్రెస్ గెలుపుకోసం వ్యూహత్మకంగా ముందుకు పోతోంది. ప్రత్యర్థి ఎత్తులను ఈసారి చిత్తు చేసే రీతిలో బీఅర్‌ఎస్ మద్దతుతో బరిలో ఉన్న అభ్యర్థులు తమదైన శైలిలో ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.
ఇద్దరి నుంచి ఎనిమిది మంది బరిలో..
పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు ఏకగ్రీవం కావాలని కాంగ్రెస్ అధిష్టానం భావించినా అలా కు దరలేదు. డివిజన్‌లోని మంథనిలో మూడు, రామగిరి మండలం నుంచి ఒక్కరు మొత్తం నాలుగు సర్పంచ్ స్థానాలే ఏకగ్రీవమయ్యాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా కాంగ్రెస్ నుంచి ఈసారి పో టీలో ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ప్రతీసారి ఒక్క పార్టీ నుంచి ఒక్కరు మాత్రమే పోటీలో ఉండగా అక్కడక్కడా రెబల్స్ దర్శమిచ్చేవారు. ఉదాహరణకు మంథని మండలంలో 35 పంచాయతీలుండగా 130 అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈసారి కాంగ్రెస్ మద్దతుదారులు 2–8, బీఆర్‌ఎస్ నుంచి కూడా ఇద్దరికి మించి పోటీలో ఉన్నారు.
ఫలించని చర్చలతో ప్రయోజనం ఎవరికో..
ఒకే పార్టీ నుంచి ఒక్కరే ఉండాలని, ఎక్కువ స్థానా లు గెలుపొందాలని కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కి చెందిన నాయకులు అభ్యర్థులతో చర్చలు జరిపినా చాలా చోట్ల ఫలించలేదు. దీంతో రెండు పార్టీల నుంచి అసమ్మతులు ఎక్కువగానే ఉన్నారు. ఈ పర్యావసానం ఎవరికి లాభం.. మరెవరికి నష్టం కలిగిస్తుందోననే ఆందోళన ఇరు పార్టీల్లో వ్యక్తమవుతోంది.
మంథనిపైనే అందరి దృష్టి


