రామగుండంలో రూ.కోటితో అంబేడ్కర్ పార్క్
గోదావరిఖని: గోదావరిఖని పట్టణ సుందరీకరణ కోసం రూ.కోటితో అంబేడ్కర్ పార్క్‌ను ని ర్మిస్తున్నట్లు రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రా జ్‌ఠాకూర్ అన్నారు. ఆదివారం డిగ్రీ కళాశాల సమీపంలో నిర్మించబోతున్న అంబేడ్కర్ పార్క్ స్థలాన్ని ఆర్జీ–1 జీఎం లలిత్‌కుమార్‌తో పరి శీలించారు. పార్క్ సుందరీకరణ, అందాల అభివృద్ధి, ల్యాండ్‌స్కేప్, లైటింగ్, పాదదారులు వంటి కీలక పనులను త్వరితగతిన ప్రారంభించి పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రాబోయే రోజుల్లో రామగుండంలో అత్యద్భుతంగా రూపుదిద్దుకోబోతోందన్నారు. ఎమ్మె ల్యే వెంట సింగరేణి శ్రీనన్న, నాయకులు దీటి బాలరాజు, మహంకాళి స్వామి, ఎండీ ముస్తఫా, కోదండరామాలయం చైర్మన్ గట్ల రమేశ్, జిల్లా అధికార ప్రతినిధి సన్నీ, సోషల్ మీడియా నాయకులు ధూళికట్ట సతీశ్ తదితరులున్నారు.
క్రీడాకారులను
ప్రోత్సహించడమే లక్ష్యం
పెద్దపల్లి: క్రీడాకారులను ప్రోత్సహించడమే బీజేపీ లక్ష్యమని పార్టీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరుగుతున్న క్రికెట్ పోటీల ముగింపు ఉత్సవాలకు ఆదివా రం ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పెద్దపల్లి–గోదావరిఖని జట్ల మధ్య జరిగిన టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ఆసక్తికరగా సాగింది. పెద్దపల్లి జట్టు విజేతగా నిలిచింది. విజేత జట్టుకు రూ.50వేలు, రన్నరప్ జట్టుకు రూ.25 వేల నగ దు పారితోషకంతో పాటు ట్రోఫీ అందించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు నల్ల మనోహర్‌రెడ్డి, మిట్టపల్లి ప్రవీన్‌కుమార్, మహేందర్, దిలీప్, శివంగారి సతీశ్, సతీశ్‌సింగ్, గౌస్ పాషా, శివంగారి రాజేశ్, దేవనంది శ్రావన్, సందీప్, శ్రీకాంత్ పాల్గొన్నారు.
ఆరు రైళ్లు.. నలభై నిమిషాలు
ఓదెల: కాజీపేట్–బల్లార్షా సెక్షన్ల మధ్యలో కొలనూర్ రైల్వేస్టేషన్ సమీపంలోని లెవల్ క్రాసింగ్ గేట్ మీదుగా ఆదివారం ఆరు రైళ్లు అప్ అండ్ డౌన్ వైపు వరుసగా వెళ్లడంతో 40 నిమిషాల పాటు వాహనాలు ఎక్కడికక్కడే కిలోమీటర్ వరకు నిలిచిపోయాయి. సుల్తానాబాద్, ఓదెల, కా ల్వశ్రీరాంపూర్‌లకు వెళ్లే ప్రయాణికులు నరకయాతనపడ్డారు. రైల్వే శాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.
రామగుండంలో రూ.కోటితో అంబేడ్కర్ పార్క్
రామగుండంలో రూ.కోటితో అంబేడ్కర్ పార్క్


