తగ్గిన ధాన్యం దిగుబడి
ఈ రైతుపేరు ఎల్లయ్యగౌడ్. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి. తనకున్న ఎకరంలో వరి వేసిండు. ఏటా 30 నుంచి 35 క్వింటాళ్ల దిగుబడి వచ్చేది. ఈసారి పది క్వింటాళ్లు కూడా రాలేదు. సమయానుకూలంగా లేని అధిక వర్షాలకు తోడు దోమపోటుతో పంట సరిగా ఎదగలేదు. చివరకు చైన్‌మిషన్‌తో వరి కోయడంతో ఖర్చు మరింత పెరిగింది. ఇది ఈ ఒక్క రైతుకు ఎదురైన సమస్యేకాదు.. జిల్లాలో చాలామంది అన్నదాతలదీ..
పెద్దపల్లి: జిల్లాలో ఈసారి ధాన్యం దిగుబడి గణ నీయంగా తగ్గిందని అన్నదాతలు వాపోతున్నారు. ఒక్కో రైతుకు విస్తీర్ణాన్ని బట్టి ఎనిమిది నుంచి కనీసం పది క్వింటాళ్ల వరకు ధాన్యం తగ్గిందని అంటున్నారు. పంట ప్రారంభంలో ఆశించిన స్థాయిలో కురవని వానలు.. పంట చేతికి వచ్చే సమయంలో ఏకధాటిగా, అధిక వర్షాలు కురవడంతో పంట దెబ్బతిన్నదంటున్నారు. వర్షాలతో పంటకు దోమపోటు ఆశించగా దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపింది.
పెరిగిన వరికోత యంత్రం అద్దె..
వరి పొలాలు తడిగా ఉండడంతో సాధారణ వరికోత యంత్రం పనిచేయడం లేదు. కేవలం చైన్‌హార్వెసర్లతోనే వరిపైరు కోయాల్సి వస్తోంది. సాధారణ హార్వెస్టర్ గంటకు రూ.2,500 నుంచి రూ.3,000 వరకు అద్దె ఉంటే.. చైన్‌హార్వెస్టర్‌కు ఎకరాకు రూ.4,000 – రూ.4,500 వరకు చెల్లించా ల్సి వస్తోంది. ఇది రైతులకు భారంగా మారుతోంది. ధాన్యాన్ని మార్కెట్ లేదా, ఇళ్లకు చేరవేసేయడానికి ట్రాక్టర్ అద్దె రూ.500 చెల్లించాల్సి వస్తోంది.
తగ్గిన ధాన్యం దిగుబడి


