
బతుకమ్మ చెంత..
పంచభక్ష పరమాన్నం అవసరం లేదు.. పండుగపూట కడుపు కాస్త నిండి తే చాలనుకుంటున్నారు ఈ వృద్ధులు.. రోజంతా యాచిస్తేకానీ బతుకు బండి సాగదంటున్నారు.. రోజులు, నెలలు, సంవత్సరాలు.. ఇలా కాలం గడిచినా తమ బతుకులు ఎప్పుడు మారేదని ప్రశ్నిస్తున్నారు. ఆధునిక సమాజం సైబర్‌వేగంతో స్మార్ట్‌గా దూసుకెళ్తుంటే.. ఆకలితో అలమటిస్తు న్న అభాగ్యులు ఇలాంటివారెందరో.. జిల్లా కేంద్రంలోని అయ్యప్పగుడి చౌరస్తాలో మంగళవారం రాత్రి బతుకమ్మ బొమ్మ వద్ద భోజనం చేస్తూ ‘సాక్షి’ కెమెరాకు ఇలా కనిపించారీ వృద్ధ దంపతులు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి