
ఆర్జీ–1ఏరియాలో 110శాతం ఉత్పత్తి
గోదావరిఖని: సింగరేణి సంస్థ రామగుండం రీజియన్‌లో సెప్టెంబర్‌లో 110శాతం బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు ఆర్జీ–1 జీఎం లలిత్‌కుమార్ వెల్లడించారు. మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సెప్టెంబర్‌లో 2.85లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి గాను 3.13 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించామన్నారు. జీడీకే–5 ఓసీపీ భారీగా బొగ్గు ఉత్పత్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు. 1.82లక్షల టన్నులకు 2.48లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసినట్లు తెలిపారు. నిర్దేశిత లక్ష్యానికి మించి 136శాతం ఉత్పత్తి సాధించినట్లు ఆయన వివరించారు. రక్షణతో కూడిన ఉత్పత్తి లక్ష్య సాధనకు ప్రతీఒక్కరు కృషి చేయాలని ఆయన కోరారు. సమావేశంలో ఎస్‌వోటూ జీఎం ఎల్.రమేశ్, ఏరియా ఇంజినీర్ రాంమోహన్‌రావు, పర్సనల్ మేనేజర్ రవీందర్‌రెడ్డి, ఎస్‌ఈ రాజన్న, సీనియర్ పీవో హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు.