
స్థానిక పోరుకు సర్వం సిద్ధం
● రెండు విడతల్లో ప్రాదేశిక ఎన్నికలు ● పంచాయతీలకు మూడ దశలు ● ఏర్పాట్లలో అధికారుల నిమగ్నం ● పల్లెల్లో ఎన్నికల సందడి
పెద్దపల్లిరూరల్: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సర్వసన్నద్ధమైంది. ఎప్పుడెప్పుడా అనే ఉత్కంఠకు తెరదించుతూ ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీచేయడంతో అధికారులు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు ఏడాదిన్నరగా ప్రత్యేకాధికారులతోనే పల్లెపాలన సాగుతోంది. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇవ్వడం.. అధికారులు లాటరీ పద్ధతిన రిజర్వేషన్లు తేల్చడంతో గ్రామాల్లో సందడి మొదలైంది.
పోలింగ్‌బూత్‌లు.. అధికారుల నియామకం
జిల్లాలో 13 జెడ్పీటీసీ, 137 ఎంపీటీసీ స్థానాలున్నాయి. 741 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. 3,989 బ్యాలెట్ బాక్స్‌లు సిద్ధం చేశారు. 13 మంది రిటర్నింగ్ అధికారులు(జెడ్పీటీసీలకు), 46మంది రిటర్నింగ్ అధికారులు (ఎంపీటీసీ)లకు, 744మంది ప్రిసైడింగ్, 744 అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లను నియమించి శిక్షణ కూడా ఇప్పించారు.
రెండు విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు..
జిల్లాలోని ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు రెండువిడతలుగా పోలింగ్ నిర్వహిస్తారు. తొలివిడతలో అంతర్గాం, ధర్మారం, కమాన్‌పూర్, మంథని, ము త్తారం, పాలకుర్తి, రామగిరి జెడ్పీటీసీ స్థానాలు, 68 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. అలాగే మలివిడతలో పెద్దపల్లి, ఎలిగేడు, జూలపల్లి, ఓదెల, కాల్వశ్రీరాంపూర్, సుల్తానాబాద్ జెడ్పీ టీసీ స్థానాలతోపాటు 69 ఎంపీటీసీ స్థానాలకు ఎ న్నికలు నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు.
రెండో, మూడో విడతలో పంచాయతీలకు..
జిల్లాలోని 13 మండలాల్లో గల 263 సర్పంచులు, 2,432 వార్డు సభ్యుల స్థానాలకు రెండు, మూడో విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. నవబంర్ 4వ తేదీన అంతర్గాం, ధర్మారం, కమాన్‌పూర్, మంథని, ముత్తారం, పాలకుర్తి, రామగిరి మండలాల్లోని 135 సర్పంచ్, 1,224 వార్డుస్థానాలకు రెండోవిడతలో ఎన్నికలు జరుగుతాయి. నవంబర్ 8న మూడోవిడతలో పెద్దపల్లి, ఎలిగేడు, జూలపల్లి, ఓదెల, కాల్వశ్రీరాంపూర్, సుల్తానాబాద్ మండలాల్లో 128 సర్పంచ్, 1,208 వార్డుస్థానాలకు ఎన్నికలను నిర్వహించనున్నారు.
4,04,209 మంది ఓటర్లు
జిల్లాలోని 13 మండలాల్లో గల 263 పంచాయతీల్లో 4,04,209 మంది ఓటర్లున్నారు. ఇందులో మహిళలు 2,05,451 మంది ఉండగా పురుషులు 1,98,744 మంది ఉన్నారు. మరో 14మంది ఇతరులు ఉన్నారు.
మండలాల వారీగా ఓటర్లు