
పురాణ నిధి యాప్ ఆవిష్కరణ
కరీంనగర్ కల్చరల్: దేవతా స్త్రోత్రాలతోపాటు పురాణ గాథలన్నీ సామాన్యులకు సైతం అర్థమయ్యేలా రూపొందించిన ‘పురాణ నిధి’ యాప్‌ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పండితులు మంగళంపల్లి వేణుగోపాలశర్మ, పురాణం మహేశ్వరశర్మతో కలిసి మంగళవారం ఆవిష్కరించారు. అనంతరం పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. దేవతలు, హిందూ శాస్త్రాలకు సంబంధించి సామాన్యుల్లో నెలకొన్న అనేక సందేహాలను ఈ యాప్ ద్వారా నివృత్తి చేస్తుండటం సంతోషించదగ్గ పరిణామమన్నారు.
బాధ్యతలు స్వీకరణ
పెద్దపల్లిరూరల్: జిల్లా ఉపాధికల్పనాధికారిగా నియమితులైన రాజశేఖర్ మంగళవారం ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం శిరసానగండ్ల గ్రామానికి చెందిన రాజశేఖర్.. గ్రూప్ – 1 పరీక్షల్లో 683వ ర్యాంక్ సాధించారు. కాగా, ఇన్‌చార్జి అధికారి తిరుపతిరావు నుంచి బాధ్యతలు స్వీకరించిన రాజశేఖర్.. కలెక్టర్ శ్రీహర్షను మర్యాదపూర్వకంగా కలిశారు.
రిటైర్డ్ పోలీసులకు సన్మానం
గోదావరిఖని: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉద్యోగ విరమణ పొందిన అధికారులను మంగళవారం ఘనంగా సన్మానించారు. రిటైర్ అయిన ఆర్‌ఎస్‌ఐ శ్రీహరి, ఏఎస్‌ఐ బి.భాస్కర్, ఏఆర్ ఎస్‌ఐ కె.రమేశ్, హెడ్‌కానిస్టేబుల్ సీహెచ్ లక్ష్మయ్యను శాలువా లతో సన్మానించి జ్ఞాపికలు అందించారు. అడిషనల్ డీసీపీ శ్రీనివాస్, ఏవో శ్రీనివాస్, ఐటీ కోర్ సీఐ చంద్రశేఖర్‌గౌడ్, రిజర్వ్ సీఐలు దామోదర్, శ్రీనివాస్, వామనమూర్తి, మల్లేశం, సూపరింటెండెంట్‌లు ఇంద్రసేనారెడ్డి, సందీప్, సీసీ హరీశ్ తదితరులు పాల్గొన్నారు.
పూలవ్యర్థాలతో ‘కంపోస్ట్’
కోల్‌సిటీ/ఫెర్టిలైజర్‌సిటీ(రామగుండం): స్వచ్ఛ తా హీ సేవాలో భాగంగా మంగళవారం పూలవ్యర్థాలను గోదావరిఖని గౌతమినగర్‌లోని కంపోస్ట్ యార్డ్‌కు తరలించారు. కంపోస్ట్ యార్డ్‌లో వీటిని సేంద్రియ ఎరువుగా మార్చనున్నట్లు రామగుండం నగర పాలక అధికారులు తెలిపారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్ సంపత్, ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ మధుకర్ పర్యవేక్షించారు.
పాండవుల గుట్టపై అధికారులు
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): పీఎం కుసుం పథకంలో భాగంగా స్థానిక పాండవుల గుట్ట వద్ద నిర్మించే సోలార్ ప్లాంట్ స్థలాన్ని డీసీవో శ్రీమా ల, కరీంనగర్ కేడీసీసీబీ ప్రతినిధి సత్యనారాయణరావు మంగళవారం పరిశీలించారు. వా రివెంట సింగిల్‌విండో చైర్మన్ చదువు రాంచంద్రారెడ్డి, సీఈవో కోలేటి శ్రీనివాస్, బ్రాంచ్ మే నేజర్ కరుణశ్రీ, ఫీల్డ్‌ఆఫీసర్ ఉన్నారు.
బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
పెద్దపల్లిరూరల్: రామగిరి మండలం సెంటినరీకాలనీకి చెందిన మౌంటేనర్ గిన్నిస్ వరల్డ్ రికా ర్డర్ మాస్టర్ వివేకానందరెడ్డి, మహిపాల్‌రెడ్డికి ఇండియా బుక్‌ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. వారిని కలెక్టర్ కోయ శ్రీహర్ష అభినందించారు. యూరప్ ఖండంలోనే ఎత్తయిన మౌంట్ ఎ ల్బ్రోస్ పర్వతాన్ని ఆగస్టు 3న అధిరోహించి ‘సే టు నో డ్రగ్స్’ బ్యానర్ ప్రదర్శించిన విషయం విదితమే. ఈ పర్వతాన్ని అధిరోహించిన తొలితండ్రీ కొడుకులుగా ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్‌లో వారు చోటు సాధించారు.

పురాణ నిధి యాప్ ఆవిష్కరణ

పురాణ నిధి యాప్ ఆవిష్కరణ

పురాణ నిధి యాప్ ఆవిష్కరణ

పురాణ నిధి యాప్ ఆవిష్కరణ