
ఎరువుల కోసం ఆందోళన వద్దు
● కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లిరూరల్: జిల్లా వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా ఎరువుల నిల్వలు ఉన్నాయని, రైతులు ఆందోళన పడొద్దని, అవసరమున్న మేరకే కొనుగోలు చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. ఈమేరకు సోమవారం అధికారులతో కలెక్టరేట్‌లో సమీక్షించారు. అవసరానికి మించి యూరియా కొనుగోలు చేసి నిల్వఉంచితే ఆవిరి అవుతుందన్నారు. ఆగస్టు వరకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం 9,400 టన్నుల యూరియా అందుబాటులో ఉందని వివరించారు. ఆగస్టులో మరో 10వేల టన్నులు అవసరముంటుందని, ఆ సమయంలో యూరియా వస్తుందని తెలిపారు.
లక్ష్యం మేరకు మొక్కలు నాటాలి
వనమహోత్సవం ద్వారా నిర్దేశించిన లక్ష్యం మేరకు ఈ నెలఖారు వరకు మొక్కలు నాటాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. ఉపాధిహామీ ద్వారా గుంతలు తవ్వించాలని అన్నారు. ఈజీఎస్ కూలీలకు సరాసరి వేతనం రూ.307 ఉండేలా చూడాలన్నారు. ప్రతీ మండలంలో కనీసం 20 ఎకరాలను ఎంపిక చేసి కమ్యూనిటీ ప్లాంటేషన్ చేపట్టాలని పేర్కొ న్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం పీఎం ఆవాస్‌యోజనతో అనుసంధానిస్తోందని, యాప్‌లో సర్వే వివరాలు సకాలంలో పూర్తిచేయాల న్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు చేపట్టాలన్నారు. హాస్టళ్ల ఆవరణ పరిశుభ్రంగా ఉంచాలని, ఫ్రైడే, డ్రైడే పక్కాగా అమలు చేయాలని సూచించారు. డీఆర్డీవో కాళిందిని, హౌసింగ్ పీడీ రాజేశ్వర్‌రావు, జెడ్పీ సీఈవో నరేందర్, డీపీవో వీరబుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.