స్థానిక సందడి | - | Sakshi
Sakshi News home page

స్థానిక సందడి

Jul 18 2025 5:00 AM | Updated on Jul 18 2025 5:00 AM

స్థాన

స్థానిక సందడి

శుక్రవారం శ్రీ 18 శ్రీ జూలై శ్రీ 2025
● సన్నద్ధమవుతున్న రాజకీయ పార్టీలు ● పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నాలు ● అందరిచూపు రిజర్వేషన్ల పైనే..
బ్యాంక్‌ ఖాతాలపై నజర్‌!

సాక్షి, పెద్దపల్లి: స్థానిక సంస్థల ఎన్నికలు మూడు నెలల్లో పూర్తిచేయాలని హైకోర్టు ఆదేశాలు.. తాజాగా ప్రభుత్వం ఎంపీటీసీ, జెడ్పీటీసీల స్థానాల సంఖ్య ఖరారు చేయడంతో గ్రామాల్లో ఎన్నికల సందడి మొదలైంది. పరిషత్‌, పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆశావహులు పల్లెబాటపడుతున్నారు. స్థానిక సమరంలో ఎలాగైనా సత్తా చాటాలని కసరత్తు చేస్తున్నారు. మరోవైపు.. వివిధ రాజకీయ పార్టీలు సైతం స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నాయి. 2024 జన వరి 31న సర్పంచ్‌, జూలై 4న ఎంపీటీసీల పదవీ కాలం ముగిసిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి పల్లెల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది

‘పార్లమెంట్‌’ తర్వాతే అనుకున్నా..

గత పార్లమెంట్‌ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థ ల ఎన్నికలు నిర్వహిస్తారని అందరూ భావించారు. కానీ, ప్రభుత్వం.. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు వర్తింపజేస్తామని కులగణన చేపట్టడంతో ఎన్నికల నిర్వహణ ఆలస్యమైంది. దీంతో హైకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఎట్టిపరిస్థితుల్లోనూ వచ్చే సెప్టెంబర్‌ 30వ తేదీలోగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. దీంతో స్థానిక సంస్థల ఎ న్నికల్లో 42శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందు కు రాష్ట్రప్రభుత్వం గవర్నర్‌ ఆమోదం కోసం ఆర్డినేనెన్స్‌ను పంపించింది. గవర్నర్‌ ఆమోదం తర్వాత రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తిచేసి ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేయనున్నారు. ఇప్పటికప్పుడు రిజర్వేషన్ల విషయం తేలక సర్వత్రా ఆందోళనకు గురవుతున్నా.. స్పష్టత వచ్చాక ఎలా వ్యవహరించాలనే దానిపైనా అంచనా రూపొందించుకుంటున్నారు.

అధికార యంత్రాంగం కసరత్తు

ఇప్పటికే వార్డుల వారీగా ఓటరు జాబితాను అధికార యంత్రాంగం రూపొందించింది. దానిని పునఃపరిశీలించి నివేదించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కలెక్టర్లను ఆదేశించింది. దీంతో పూర్తిస్థాయి వివరాల సేకరణపై జిల్లా అధికారులు మరోసారి దృష్టి సారించారు. ఇప్పటికే రిటర్నింగ్‌, సహాయ రిటర్నింగ్‌ అధికారులు, సిబ్బందికి ఒకవిడత శిక్షణ ఇచ్చా రు. రిటైర్‌మెంట్లు, బదిలీలతో తాజాగా వార్డుల వారీగా ఎన్నికల జాబితా సిద్ధం చేస్తున్నారు.

పై‘చేయి’ సాధించేందుకు..

అధికారంలో ఉన్నాం.. అనేక ప్రజాసంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం.. కాబట్టి స్థానిక ఎన్నికల్లో తమదే పైచేయి ఉంటుందన్న ఆశతో కాంగ్రెస్‌ పార్టీ ఉంది. ఈనేపథ్యంలోనే ఇటీవల అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో రైతుభరోసా సొమ్ము జమచేయగా, ఇందిరా మహిళాశక్తి సంబురాల పేరిట ప్రజల్లోకి వెళ్తోంది. స్థానిక ఎమ్మెల్యేలు ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గు పోయడం, కొత్త రేషన్‌కార్డులు పంపిణీ చేయడం తదితర కార్యక్రమాలతో పార్టీ క్యాడర్‌ను ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు.

కారును పరుగులు పెట్టించేందుకు..

పల్లెల్లో పట్టు నిలుపుకొనేందుకు బీఆర్‌ఎస్‌ కసరత్తు తీవ్రం చేస్తోంది. అధికారంలో లేమనే భావనను కార్యకర్తల్లో నుంచి తొలగించి, స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యోన్ముఖులుగా తీర్చిదిద్దేందుకు బీఆర్‌ఎస్‌ నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్‌ పాలనపై ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతే బీఆర్‌ఎస్‌కు కలిసి వస్తుందన్న ధీమాల్లో ఆ పార్టీ శ్రేణులు ఉన్నాయి.

కమలం వికసించేలా..

పార్లమెంట్‌ ఎన్నికలతో పాటు, ఇటీవల నిర్వహించిన పట్టభద్రులు, టీచర్‌ ఎమ్మెల్సీల విజయాన్ని స్థానిక ఎన్నికల్లో సైతం కొనసాగించేలా కమలం నే తలు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, నేతల మ ధ్య గ్రూప్‌ రాజకీయాలతో గందరగోళం నెలకొంద ని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ విభేదాలతో బీజేపీ ఏ విషయాన్ని స్పష్టం చేయడం లేదు. ఈ క్రమంలోనే గత ఎన్నికల్లో సాధించిన ఓట్లును నిలుపుకుంటుందో లేదా అనేది వేచిచూడాల్సిందే.

న్యూస్‌రీల్‌

జిల్లా సమాచారం

గ్రామపంచాయతీలు 263

వార్డులు 2,432

ఎంపీటీసీ స్థానాలు 137

జెడ్పీటీసీ స్థానాలు 13

పురుష ఓటర్లు 2,03,358

మహిళా ఓటర్లు 2,09,918

ఇతరులు 13

స్థానిక సందడి 1
1/2

స్థానిక సందడి

స్థానిక సందడి 2
2/2

స్థానిక సందడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement