ముగ్గురు ఎమ్మెల్యేలు.. మూడుసార్లు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

ముగ్గురు ఎమ్మెల్యేలు.. మూడుసార్లు ప్రారంభం

Jul 18 2025 5:00 AM | Updated on Jul 18 2025 5:00 AM

ముగ్గురు ఎమ్మెల్యేలు.. మూడుసార్లు ప్రారంభం

ముగ్గురు ఎమ్మెల్యేలు.. మూడుసార్లు ప్రారంభం

యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): వినియోగదారులకు తాజా కూరగాయలు అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో పట్టణంలోని తెలంగాణ చౌ రస్తా వాటర్‌ ట్యాంక్‌ వద్ద గల స్థలాన్ని రోజూ వారి మార్కెట్‌ కోసం గతంలో కేటాయించారు. దాదాపు రూ.60లక్షల వ్యయంతో చేపట్టిన మార్కెట్‌ పనులకు 2017లో అప్పటి రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ శంకుస్థాపన చేశారు. వివిధ కారణాలతో పనులు మ ధ్యలోనే ఆగిపోయాయి. దీంతో 2019లో అప్పటి ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ ఆ పనులను మళ్లీ ప్రారంభించారు. కొంతకాలం పాటు నిర్మాణం శరవేగంగా సాగినా.. ఆ తర్వాత మార్కెట్‌లో షెడ్ల వరకే నిర్మించి అక్కడితోనే వదిలేశారు.

మందుబాబులకు అడ్డాగా..

నిర్మానుష్యంగా ఉన్న అసంపూర్తి మార్కెట్‌ షెడ్లు మద్యంబాబులకు అడ్డాగా మారాయి. సమీప వైన్స్‌షాపుల్లో మందు కోనుగోలు చేస్తున్న కొందరు మార్కెట్‌ షెడ్లలోకి చేరి చిత్తుగా మద్యం తాగుతున్నారు. అటుగా వెళ్తున్న ప్రజలు, స్థానికులు వారి ఆగడాలతో ఇబ్బందులు పడుతున్నారు. ఇదే విషయంపై ‘సాక్షి’లో ‘రోజూవారి మార్కెట్‌కు మోక్షమోప్పుడో?’ శీర్షికన పలుసార్లు కథనాలు కూడా ప్రచురితమయ్యాయి. ఎట్టకేల కు స్పందించిన రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ అరుణశ్రీ.. ఇటీవల డెయిలీ మార్కెట్‌ షెడ్లు పరిశీలించారు. విషయాన్ని రామగుండం ప్రస్తుత ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన.. మిగిలిన పనులను పూర్తిచేసి మార్కెట్‌ను అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. గతంలో కేటాయించిన నిధులు సరిపోలేదు. దీంతో మరో రూ.20లక్షలు మంజూరుకావడంతో గురువారం మూడోసారి ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ మార్కెట్‌ పనులు ప్రారంభించారు.

మార్కెట్‌ను అందుబాటులోకి తీసుకొస్తా..

పనులు ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే ఠాకూర్‌ మాట్లాడుతూ, దాదాపు ఎనిమిదేళ్లుగా నిరుపయోగంగా ఉన్నరోజూవారి మార్కెట్‌ను నెలరోజుల్లోనే పూర్తిచేయిస్తామన్నారు. అందులో సకలసౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. అతిత్వరలోనే దానిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఈ నిధులు సరిపోకపోతే అవసరమైతే మరిన్ని మంజూరు చేయిస్తామని ఆయన పేర్కొన్నారు. జిల్లా కాంగ్రెస్‌ కమిటీ వైస్‌ ప్రెసిడెంట్‌ మారెల్లి రాజిరెడ్డి, పట్టణ అద్యక్షుడు గుండేటి రాజేశ్‌, నాయకులు శంకర్‌ నాయక్‌, జక్కుల దామోదర్‌రావు, సాగంటి శంకర్‌, మార్క రాజు, రాజేశం, తి రుపతిరెడ్డి, రాములు, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఎనిమిదేళ్లయినా అందుబాటులోకిరాని మార్కెట్‌

ఇప్పటికై నా వినియోగంలోకి తేవాలంటున్న నగర ప్రజలు

సకల సౌకర్యాలతో త్వరలోనే అందుబాటులోకి

తీసుకొస్తామన్న ఎమ్మెల్యే ఠాకూర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement