డీఏవోను కలిసిన ప్రతినిధులు | - | Sakshi
Sakshi News home page

డీఏవోను కలిసిన ప్రతినిధులు

Jul 18 2025 5:00 AM | Updated on Jul 18 2025 5:00 AM

డీఏవో

డీఏవోను కలిసిన ప్రతినిధులు

పెద్దపల్లిరూరల్‌: ఇటీవల జిల్లా వ్యవసాయాధికారిగా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్‌ను టీఎన్టీజీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు బొంకూరి శంకర్‌, వ్యవసాయ విస్తీర్ణాధికారులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. పె ద్దపల్లి, మంథని ఏడీఏలు శ్రీనాథ్‌, అంజనీమి శ్రా, నాయకులు మహేందర్‌, శ్రీధర్‌, శ్రీనివా స్‌, వినయ్‌కుమార్‌, పూర్ణచందర్‌, రాకేశ్‌, ప్ర శాంత్‌, వినీత్‌, రవితేజ, కల్పన ఉన్నారు.

పెరిగిన రాజకీయ జోక్యం

గోదావరిఖని: బీఆర్‌ఎస్‌ కన్నా కాంగ్రెస్‌ హ యాంలోనే సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగిందని ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీ తారామయ్య అన్నారు. ఆర్జీవన్‌ ఏరియా జీడీకే–2వ గనిపై గురువారం ఏర్పాటు చేసిన గేట్‌ మీటింగ్‌లో మాట్లాడారు. సింగరేణికి రూ.36 వేల కోట్ల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. సీఎండీ, డై రెక్టర్‌(పా) సమావేశాల్లో అంగీకరించిన డి మాండ్‌లను వెంటనే పరిష్కరించాలన్నారు. నాయకులు రంగు శ్రీను, మడ్డి ఎల్లాగౌడ్‌, క వ్వంపల్లి స్వామి, ఆరెల్లి పోశం, మాదన మహే శ్‌, ఎస్‌.వెంకట్‌రెడ్డి, మిట్ట శంకర్‌, సయ్యద్‌ సోహేల్‌, పొన్నాల వెంకటయ్య, కారంపూరి వెంకన్న, గుర్రం ప్రభుదాస్‌, పెద్దెల్లి శంకర్‌, భక్తి శ్రీనివాస్‌, ఎల్‌.రమేశ్‌ పాల్గొన్నారు.

బిల్లులు విడుదల చేయాలి

పెద్దపల్లిరూరల్‌: ఉపాధ్యాయల పెండింగ్‌ బిల్లులను సత్వరమే చెల్లించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్‌) జిల్లా అధ్య క్షుడు సునీల్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. రాఘవాపూ ర్‌ తదితర పాఠశాలల్లో గురువారం చేపట్టిన స భ్యత్వ నమోదులో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని, న గదు రహిత హెల్త్‌కార్డులు జారీచేయాలని, పీ ఆర్సీ అమలు చేయాలని కోరారు. హెచ్‌ఎం పో స్టులు భర్తీ చేయాలని, జీజీఎస్‌ చెల్లించేవరకూ ఆ సొమ్ముకు వడ్డీ వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు. నాయకులు సతీశ్‌బాబు, ఐలయ్య, అనిల్‌ప్రసాద్‌, రాజేందర్‌ తదతరులు ఉన్నారు.

పంచాయతీ ఉద్యోగుల జేఏసీ కార్యవర్గం

సుల్తానాబాద్‌రూరల్‌(పెద్దప ల్లి): జిల్లా గ్రామ పంచాయ తీ ఉద్యోగులు, అనుబంధ సంఘాల జేఏసీ కార్యవర్గా న్ని నీరుకుల్ల రంగనాయకస్వామి ఆలయ ఆవరణలో గురువారం ఏకగ్రీవంగా ఎ న్నుకున్నారు. చైర్మన్‌గా జొన్నకోటి వెంకటేశ్‌, ప్రధాన కార్యదర్శిగా అశోక్‌, వైస్‌ చైర్మన్‌లుగా సంతోష్‌, కనుకయ్య, పురుషోత్తం, కోశాధికారి గా భూమయ్య, ముఖ్య సలహాదారులుగా స త్తయ్య, రాజలింగయ్య, సహాయ కార్యదర్శు లుగా సత్యం, సుధాకర్‌, రమేశ్‌, మధుసూదన్‌, ప్రచార కార్యదర్శులుగా కుమార్‌, రమేశ్‌, గౌర వ అధ్యక్షుడిగా కొమురయ్యను ఎన్నుకున్నారు.

స్వచ్ఛసర్వేక్షణ్‌లో ప్రతిభ

కోల్‌సిటీ(రామగుండం): స్వచ్ఛ సర్వేక్షణ్‌ పోటీ ల్లో రామగుండం బల్దియా 216వ ర్యాంక్‌ సా ధించింది. గురువారం కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2024–25లో పోటీల్లో పాల్గొన్న ము న్సిపాలిటీల ర్యాంకుల వివరాలను ప్రకటించింది. మనరాష్ట్రంలోని 143 మున్సిపాలిటీల్లో రామగుండం 28వ స్థానంలో నిలిచింది. పారిశుధ్యం మెరుగుకు తీసుకుంటున్న చర్యలతోనే మెరుగైన ర్యాంక్‌ను సాధించిందని అధికారులు వెల్లడిస్తున్నారు. మల్కాపూర్‌లోని ఎఫ్‌ఎస్‌టీపీ ని ఉపయోగంలోకి తీసుకురావడంతో ఓడీఎఫ్‌ ప్లస్‌ ప్లస్‌ హోదా దక్కింది. ఇందుకు కృషి చేసిన అధికారులు, సిబ్బందిని బల్దియా కమిషనర్‌ (ఎఫ్‌ఏసీ) అరుణశ్రీ అభినందించారు.

ఇంటినుంచే తపాలా సేవలు

పెద్దపల్లిరూరల్‌: తపాలా శాఖలో 2.0 ద్వారా ఇంటినుంచే సేవలు పొందే వీలుందని పోస్టల్‌ సూపరింటెండెంట్‌ నంద తెలిపారు. రెండు హె డ్‌పోస్టాఫీసులు, 41 సబ్‌, 332 బ్రాంచి పోస్టా ఫీసుల సిబ్బందికి సేవలపై శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఆధునిక సేవలు అందుబాటు లోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నారని, అందుకే ఈనెల 21 వరకు సేవలు నిలిపివేస్తున్నామన్నారు.

డీఏవోను కలిసిన ప్రతినిధులు 
1
1/1

డీఏవోను కలిసిన ప్రతినిధులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement