సుల్తానాబాద్‌కు అదనపు జూనియర్‌ సివిల్‌ కోర్టు | - | Sakshi
Sakshi News home page

సుల్తానాబాద్‌కు అదనపు జూనియర్‌ సివిల్‌ కోర్టు

Jun 30 2025 3:48 AM | Updated on Jun 30 2025 3:48 AM

సుల్త

సుల్తానాబాద్‌కు అదనపు జూనియర్‌ సివిల్‌ కోర్టు

సుల్తానాబాద్‌: సుల్తానాబాద్‌కు అదనపు జూనియర్‌ సివిల్‌ కం అదనపు జ్యూడిషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కోర్టును ప్రభుత్వం మంజూరు చేసింది. ఈమేరకు ఈనెల 27న ప్రభుత్వ న్యాయశాఖ కార్యదర్శి రేండ్ల తిరుపతి ఉత్తర్వులు జారీ చేశారు. అదనపు కోర్టు మంజూరుకు కృషి చేసిన మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే విజయరమణరావులకు బార్‌ అసోసియేషన్‌ కృతజ్ఞతలు తెలిపింది.

బోనాల జాతర

గోదావరిఖని: ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం మైసమ్మ బోనాల జాతర ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే సతీమణి మనాలీఠాగూర్‌ నెత్తిపై బోనం ఎత్తుకొని డప్పు చప్పుళ్లతో క్యాంపు కార్యాలయం ఎదురుగా ఉన్న మైసమ్మ ఆలయం వద్దకు వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ మైసమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు బొంతల రాజేశ్‌, గుండేటి రాజేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

‘ఖని’ నుంచి అరుణాచలంకు ఆర్టీసీ ప్రత్యేక బస్సు

గోదావరిఖనిటౌన్‌: గురుపౌర్ణమి సందర్భంగా అరుణాచలంకు ప్రత్యేక రాజధాని ఏసీ బస్‌ సౌకర్యం కల్పిస్తున్నట్లు గోదావరిఖని ఆర్టీసీ డిపో మేనేజర్‌ ఎం.నాగభూషణం తెలిపారు. బస్సు జూలై 8న గోదావరిఖని నుంచి మధ్యాహ్నం 3 గంటలకు బయలు దేరి కాణిపాకం, వెల్లూరు గోల్డెన్‌టెంపుల్‌ దర్శనం అనంతరం అరుణాచలం చేరుకుంటుందని అన్నారు. 10న గురుపౌర్ణమి రోజు అరుణాచలం గిరి ప్రదక్షణ అనంతరం తిరుగు ప్రయాణంలో జోగులాంబ శక్తిపీఠం దర్శనం ఉంటుందని తెలిపారు. టికెట్‌ ధర అప్‌ అండ్‌ డౌన్‌ కలిపి ఒకరికి కేవలం రూ.5,900గా నిర్ణయించామన్నారు. ముందస్తు రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. పూర్తి వివరాలకు 7013504982, 7382847427 నంబర్లలో సంప్రదించాలని డీఎం కోరారు.

పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి

పెద్దపల్లిరూరల్‌: ఉపాధ్యాయ, ఉద్యోగ పెన్షన్ల పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని తెలంగాణ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర నాయకుడు రమేశ్‌ డిమాండ్‌ చేశారు. పెద్దపల్లిలోని సరస్వతి శిశుమందిర్‌ ఉన్నత పాఠశాలలో ఆదివారం నిర్వహించిన జిల్లాశాఖ సమావేశంలో మాట్లాడారు. పీఆర్‌సీ నివేదికలను బట్టి కొత్త పీఆర్‌సీ అమలు చేయాలన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు హెల్త్‌కార్డులు అందించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో నాయకులు సునీల్‌రెడ్డి, శ్రీనివాసరావు, కనకయ్య, అంజయ్య, వీరస్వామి, వెంకటేశ్వర్లు, అనిల్‌, ప్రసాద్‌, సురేందర్‌ పాల్గొన్నారు.

మొబైల్‌ పంక్చర్‌ వాహనం

మంథనిరూరల్‌: సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన నేపథ్యంలో మొబైల్‌ బిజినెస్‌లు పెరిగిపోయాయి. మొబైల్‌ ఫోన్‌లో ఆర్డర్‌ పెడితే చాలు క్షణాల్లో ఇంటి గుమ్మం ముందు ఉంటుంది. ఈక్రమంలోనే మంథనికి చెందిన మాజిద్‌ ఏకంగా మొబైల్‌పంక్చర్‌ సర్వీస్‌ ప్రారంభించాడు. ఓ చిన్న ట్రాలీ ఆటోలో ఏర్‌ ట్యాంకును ఏర్పాటు చేసుకుని పంక్చర్‌సామగ్రితో పల్లెల్లో తిరుగుతున్నాడు. ఎక్కడైనా వాహనం పంక్చర్‌ అయితే అక్కడికి వెళ్లి పంక్చర్‌ చేస్తున్నాడు. మంథని మండలం వెంకటాపూర్‌లో ఓ ట్రాక్టర్‌ టైర్‌కు మొబైల్‌పంక్చర్‌ వాహనంతో పంక్చర్‌ వేస్తుండగా ‘సాక్షి’ కెమెరా క్లిక్‌ మనిపించింది.

సుల్తానాబాద్‌కు అదనపు జూనియర్‌ సివిల్‌  కోర్టు1
1/1

సుల్తానాబాద్‌కు అదనపు జూనియర్‌ సివిల్‌ కోర్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement