మెరుగైన బోధన చేయాలి | - | Sakshi
Sakshi News home page

మెరుగైన బోధన చేయాలి

Jul 1 2025 7:19 AM | Updated on Jul 1 2025 7:19 AM

మెరుగ

మెరుగైన బోధన చేయాలి

పెద్దపల్లిరూరల్‌: ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఫలితాలను సాధించేందుకు నాణ్యమైన బోధన చేయాలని కలెక్టర్‌ శ్రీహర్ష ఆదేశించా రు. పలువురు హెచ్‌ఎంలతో ఆయన సోమవా రం కలెక్టరేట్‌లో సమావేశమై పలు సూచనలిచ్చారు. విద్యాప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు. కనీసం 90శాతం విద్యార్థులకు చదవడం, రాయడం, బేసిక్‌ మ్యాథ్స్‌ అర్థం కావాలని తెలిపారు. మధ్యాహ్నభోజనం నాణ్యంగా ఉండేలా చూడాలని సూచించారు. డీఈవో మాధవి, సమన్వయ అధికారి పీఎంషేక్‌ తదితరులు పాల్గొన్నారు.

పోలీస్‌ అధికారులకు సన్మానం

గోదావరిఖని: ఉద్యోగ విరమణ పొందిన పో లీసు అధికారులను రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా సోమవారం తన కా ర్యాలయంలో సన్మానించారు. ఇందులో ఎస్‌ఐ వెంకటేశ్వర్‌రావు, ఎన్‌.చంద్రశేఖర్‌, ఎం.అంజయ్య ఉన్నారు. అడిషనల్‌ డీసీపీ రాజు, స్పెషల్‌ బ్రాంచ్‌, ఏఆర్‌ ఏసీపీలు మల్లారెడ్డి, ప్రతాప్‌, ఏవో శ్రీనివాస్‌, సీసీఆర్‌బీ సీఐ సతీశ్‌, ఆర్‌ఐలు దామోదర్‌, మల్లేశం, వామనమూర్తి ఉన్నారు.

గోరింటాకు సంబురం

మంథని: ఆషాఢ మాసంలో తొలివారం సందర్భంగా మంత్రపురిలోని శ్రీలక్ష్మీనారాయణస్వా మి ఆలయంలో సోమవారం గోరింటాకు సంబురాలు ఘనంగా జరుకున్నారు. పట్టణానికి చెందిన బండారి సునీత ఆధ్వర్యంలో విష్ణులలిత పారాయణ మహిళలు ప్రత్యేకంగా గోరింటాకు తయారు చేసుకున్నారు. లక్ష్మీనారాయణస్వామి, లక్ష్మీదేవి, గోదాదేవి అమ్మవార్ల చేతులకు గోరింటాకు అలకరించారు. ఆషాఢంలో గోరింటాకు అలంకరించుకుంటే అనేక ప్రయోజనాలు ఉంటాయని ఆమె పేర్కొన్నారు.

స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి

సుల్తానాబాద్‌రూరల్‌(పెద్దపల్లి): స్థానిక ఎన్నిక ల్లో కాంగ్రెస్‌ మద్దతుదారులను గెలిపించి సత్తా చాటాలని ఎమ్మెల్యే విజయరమణారావు కోరా రు. ఐతరాజుపల్లి, భూపతిపూర్‌, గొల్లపల్లి, నా రాయణారావుపల్లి, సాంబయ్యపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే సోమవారం సుడిగాలి పర్యటన చేశా రు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ముగ్గు పోశా రు. ప్రొసీడింగ్స్‌ అందజేసి మాట్లాడారు. కాంగ్రెస్‌ మద్దతుదారులను గెలిపిస్తే గ్రామాలు సంపూర్ణ అభివృద్ధి చెందుతాయని తెలిపారు. జి ల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అన్నయ్యగౌడ్‌, ఏఎంసీ చైర్మన్‌ ప్రకాశ్‌రావు, ఎంపీడీవో దివ్వదర్శన్‌, నాయకులు సతీశ్‌, రాములు, తిరుమల్‌రావు, జాని, వెంకన్న, రాజిరెడ్డి, చక్రపాణి, రాజు, బక్కయ్య, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

రేపు క్రికెట్‌ జిల్లా జట్టు ఎంపిక

గోదావరిఖనిటౌన్‌: మహిళా క్రికెట్‌ జిల్లా జట్టు ఎంపిక పోటీలు ఈనెల 2న ఉదయం 9 గంట లకు గోదావరిఖని జీఎంకాలనీ గ్రౌండ్‌లో నిర్వహించనున్నట్టు క్యాంప్‌ జిల్లా ఇన్‌చార్జి కిరణ్‌కుమార్‌ యాదవ్‌ తెలిపారు. సుధాకర్‌ ఆధ్వర్యంలో ఎంపిక పోటీలు ఉంటాయని పేర్కొన్నారు.

మెరుగైన బోధన చేయాలి 1
1/3

మెరుగైన బోధన చేయాలి

మెరుగైన బోధన చేయాలి 2
2/3

మెరుగైన బోధన చేయాలి

మెరుగైన బోధన చేయాలి 3
3/3

మెరుగైన బోధన చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement