
సమస్యలకు సత్వర పరిష్కారం
● అడిషనల్ కలెక్టర్ వేణు ● ప్రజావాణిలో అర్జీలు స్వీకరణ
పెద్దపల్లిరూరల్: జిల్లాలోని పలు మండలాలు, గ్రామాలకు చెందిన ప్రజలు
ప్రతీ సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదులకు సత్వర పరిష్కారం చూపాలని అడిషనల్ కలెక్టర్ వేణు సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం జిల్లాలోని మండలాలు, గ్రామాలనుంచి వచ్చిన ప్రజల నుంచి ఆయన దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడారు. ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించి ప్రభుత్వ సేవలపై నమ్మకం
కలిగించాలని ఆయన సూచించారు.