
ప్రజాసమస్యలు పరిష్కరించాలి
గోదావరిఖని: ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ సూచించారు. సోమవారం క్యాంపు కార్యాల యంలో ప్రజలను నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు. తాగునీటి ఇబ్బందులు, రోడ్ల మరమ్మతులు, డ్రైనేజ్ సమస్యలు, ఆరోగ్యసేవలు, విద్య తదితర అంశాలపై అందిన ఫిర్యాదులను ఆయన పరిశీలించారు.
పేదల సంక్షేమమే ధ్యేయం
పాలకుర్తి(రామగుండం): పేదల సంక్షేమమే ధ్యే యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ అన్నారు. మండల కేంద్రంతోపాటు కొత్తపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఆయన ముగ్గు పోశారు. అనంతరం ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. కన్నాల సింగిల్‌విండో చైర్మన్ బయ్యపు మనోహర్‌రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముక్కె ర శ్రీనివాస్, మాజీ ఎంపీపీ గంగాధర రమేశ్ మాజీ సర్పంచ్ మల్లెత్తుల శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభం
ఫెర్టిలైజర్‌సిటీ(రామగుండం): పాలకుర్తి మండలం ఎల్కలపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ భూమిపూజ చేశారు. మాజీ సర్పంచ్ చిట్టబోయిన రాజకుమార్, 14వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు బూర్ల శ్రీనివాస్, రాజిరెడ్డి, బండ రమేశ్‌రెడ్డి, రాకేశ్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.