
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
ధర్మారం(ధర్మపురి): ఇందిరమ్మ ప్రభుత్వ పాలన లో అర్హులైన ప్రతీఒక్కరి సంక్షేమ ఫలాలు అందు తాయని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. బొమ్మారెడ్డిపల్లి, చామనపల్లిలో ప్రమాదవాశాత్తు మృతిచెందిన గొ ర్రెలకు రూ.8లక్షల 70వేల పరిహారం చెక్కులను కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి సోమవారం మంత్రి బాధితులకు అందజేశారు. మేడారంలో విద్యు త్ మరమ్మతులు, అభివృద్ధి పనులు, ఇందిరమ్మ ఇళ్లకు మంజూరు పత్రాలు అందజేశారు. ధర్మారంలో ఇందిరమ్మ మోడల్ హౌస్‌ను ప్రారంభించి మాట్లాడారు. నందిమేడారంలో విద్యుత్ లూస్‌వైర్లు, ట్రాన్స్‌ఫార్మర్ల సమస్యలు, ఇళ్లపై విద్యుత్ తీగల తొలగింపు కోసం రూ.26లక్షలు మంజూరు చేశామని, రూ.80లక్షలతో సీసీ రోడ్లు నిర్మించా మని తెలిపారు. ధర్మారంలో ఐటీఐ ఏర్పాటుకు జీ వో విడుదల చేశామని తెలిపారు. వ్యవసాయ మా ర్కెట్ కమిటీ చైర్మన్ లావుడ్య రూప్లానాయక్, వైస్ చైర్మన్ అరిగే లింగయ్య, ఆర్డీవో గంగయ్య, హౌ సింగ్ పీడీ రాజేశ్వర్‌రావు, ఇన్‌చార్జి తహసీల్దార్ ఉ దయ్‌కుమార్, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు. మంత్రికి యాదవసంఘంస్వాగతం పలు కగా, ఆర్యవైశ్య సంఘం నేతలు సన్మానించారు.
● మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్