సాక్షి, పెద్దపల్లి: బల్దియాల్లో మురుగునీటి పారుదల వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. చాలాకాలనీల్లో మురుగునీరు బయటకు వెళ్లేమార్గం లేకుండా పో యింది. దీంతో పల్లపు ప్రాంతాల్లో నిలిచి కాలనీలు మురికూపాలుగా మారుతున్నాయి. ప్రధాన కాలువల్లో పూడిక తొలగించక, పలుచోట్ల కబ్జాకు గురవ డ, మరికొన్నిచోట్ల కాలువలే లేక మురుగు రోడ్లపై కి వస్తోంది. ఫలితంగా దోమలు, దుర్వాసన భరించలేకపోతున్నారు. వర్షాకాలం కావడంతో జ్వరాలు, డెంగీ తదితర వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది.
కనిపించని కాలువలు
రామగుండం నగరంతోపాటు పట్టణాల్లో ప్రధానంగా డ్రైనేజీల సమస్య వేధిస్తోంది. మున్సిపాలిటీల్లో ని పాత వార్డుల్లో డ్రైనేజీలు ఉన్నా.. పూడిక తీయక సమస్యలు వస్తున్నాయి. ఐదేళ్లు గడిచినా.. విలీన కాలనీల్లో పారిశుధ్యం మెరుగుపడలేదు. కొత్త కా ల నీల్లో వీటి ఊసేలేదు. జనావాసాలు, ఖాళీస్థలాల్లో నీరు నిలిచి ఉంటోంది. కాలువలు ఉన్నచోట నిర్వహణ కరువై, ధ్వంసంమైన చోట మరమ్మతులు లేక వ్యర్థ జలాలు రోడ్డుపైకి చేరుతున్నాయి. భూగర్భ మురుగునీటి కాలువలులేక ఇబ్బందులు తప్పడం లేదు. పలుచోట్ల కాలువలు శిథిలమవడం, ఇరుగ్గా ఉండటంతో రోడ్లపైనే మురుగు పారుతూ అపరిశుభ్రత తాండవిస్తోంది. ప్రజాప్రతినిధులు, అధికారు లు దృష్టి సారించక ఇబ్బందులు తప్పడం లేదు. జ నాభాకు అనుగుణంగా బల్దియాల్లో పారిశుధ్య కార్మికలు లేక సమస్య మరింత జటిలమవుతోంది.
డ్రైనేజీల పొడవు(కి.మీ.లలో)
రామగుండం 32.5
సుల్తానాబాద్ 15.0
మంథని 12.5
పెద్దపల్లి 4.5
బల్దియాల్లో అస్తవ్యస్తంగా డ్రైనేజీ వ్యవస్థ రోడ్లపై నీరు పారుతున్నా పట్టించుకోని వైనం
ఏటా వర్షాకాలంలో ప్రజలకు తప్పని తంటాలు వ్యాధులకాలంలో కనిపించని ముందస్తు చర్యలు
ఈ చిత్రం మురికివాడలోది అనుకుంటే పొరపాటే. రామగుండం బల్దియాలో నిర్మించిన ఖరీదైన భవనాల ఎదుట పారుతున్న మురుగు. గోదావరిఖని శ్రీదుర్గానగర్‌కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైపులు, మ్యాన్‌హోల్స్ పగిలి మురుగు సాఫీగా పారడం లేదు. జనావాసాల్లోనే వరదలా పారుతోంది. ఇది ఒకరోజు, వారంరోజుల సమస్య కాదు.. ఏడాదిగా కాలనీవాసులు నరకయాతన పడుతూనే ఉన్నారు. దీనిద్వారా దోమలు, ఈగలు వృద్ధి చెంది కాలనీ కంపు కొడుతోంది. వర్షాలతో పరిస్థితి మరింత అధ్వానంగా మారింది.
ఇది మంథని మున్సిపల్‌లోని పద్మశాలీ వీధిలోని మురుగునీటి కాలువ. పూడిక తీయక.. రోడ్డు వెంట వెళ్లే వర్షపునీరు ఇలా ఇళ్లలోకి చేరుతోంది. కొన్ని వీధుల్లో ఇటీవల అండర్ గ్రౌండ్, ఓపెన్ డ్రైనేజీలు నిర్మించినా.. సక్రమంగా లేవు. చిన్నవర్షానికే వర్షపునీరు రోడ్ల వెంట పారుతోంది. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని కాలువలు సక్రమంగా లేవు. వర్షపునీరు బస్టాండ్‌లోకి చేరుతోంది. ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.
అధ్వానంగా ఉన్న మురుగు లీకేజీతోపాటు పందులు స్వైరవిహారం చేస్తున్న ఈ చిత్రం గోదావరిఖని ఇందిరానగర్ కల్లు డిపో ఎదుటి ప్రాంతం. మ్యాన్‌హోల్ పగిలి మురుగు రోడ్డుపై ఇలా పారుతోంది. ఇందులోనే పందులు స్వైరవిహారం చేస్తున్నాయి. వీటిద్వారా మెదడువాపు వ్యాధితోపాటు మురుగుతో డెంగీ, మలేరియా ప్రబలే ప్రమాదం పొంచి ఉంది.
ఇది సుల్తానాబాద్ శాసీ్త్రనగర్‌లోనిది. మురుగునీటి కాలువలేదు. రాజీవ్‌రహదారిపైనే మురుగు పారుతోంది. కాలువలు నిర్మించక ఈ దుస్థితి తలెత్తింది. తరచూ బురద చేరుతుండడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇది గోదావరిఖని మార్కండేయకాలనీ శివాలయం సమీపంలోని మేజర్ నాలా. నాలా నిర్మాణానికి గతంలోనే టెండర్ కూడా పిలిచారు. పనులు పూర్తి చేయకుండా ఇలా నిర్లక్ష్యంగా వదిలేశారు. ఫలితంగా సమీప కుటుంబాలు మురుగు దుర్వాసనతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కాలువలోంచి పాములు, తేళ్లు ఇళ్లలోకి వస్తున్నాయని స్థానికులు ఆందో ళన చెందుతున్నారు. అధికారులు ఇటీవల పిచ్చిమొక్కలు మొక్కుబడిగా తొలగించి చేతులు దులుపుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
డ్రైనేజీ నిండి పొంగిపారుతున్న ఈ దృశ్యం జిల్లా కేంద్రంలోని భూమ్‌నగర్‌లోనిది. పలుకాలనీల్లోని డ్రైనేజీల్లో రోజూ పూడికతీయక, ము రుగు ఇలా రోడ్లు, ఇళ్లలోకి చేరుతోంది. దుర్వాసన రావడంతో స్థానికులు భరించలేకపోతున్నారు.
మురికికూపాలు
మురికికూపాలు
మురికికూపాలు
మురికికూపాలు
మురికికూపాలు
మురికికూపాలు
మురికికూపాలు