
మల్లన్న సన్నిధిలో భక్తుల రద్దీ
ఓదెల: ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి భక్తులు అధికంగా వచ్చి దర్శనం చేసుకున్నారు. ఒగ్గుపూజాలతో పట్నాలు వేసి బోనాలు చెల్లించుకున్నారు. శివసత్తుల పూనకాలతో ఆలయంలో నెలకొంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ ఈవో సదయ్య ఏర్పాట్లు చేశారు. ఓదెల మల్లికార్జున స్వామిని ఆదివారం పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ కుటుంబసమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో సదయ్యపూర్ణకుంభంతో స్వాగతం పలికి శాలువ, మెమొంటోతో సత్కరించారు.

మల్లన్న సన్నిధిలో భక్తుల రద్దీ