
పనులు నాణ్యతతో వేగంగా పూర్తిచేయాలి
గోదావరిఖని: పనులు నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ అన్నారు. రోజువారీ మార్కెట్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆదివారం పరిశీలించారు. శివాజీనగర్ డైలీమార్కెట్ పురోగతి తెలుసుకున్నారు. టీయూఎఫ్‌ఐడీసీ ద్వారా మంజూరైన రూ.2.50 కోట్లతో చేపట్టిన పనుల తీరును సమీక్షించారు. ఈనిధులతో రోడ్లు, డ్రైనేజీ, షెడ్ల నిర్మాణం జరుగుతోందన్నారు. ఎమ్మెల్యే వెంట నాయకులు మహంకాళిస్వామి, బొంతల రాజేశ్ తదితరులున్నారు.
భారీ హనుమాన్ విగ్రహ పనుల పరిశీలన
రామగుండం: రామగుండం బైపాస్ రోడ్డు ఎదుట శ్రీరామునిగుండాల కొండపై గల శ్రీధనుర్భారామాంజనేయ ఆలయ ప్రాంగణంలో నిర్మిస్తున్న భారీ పంచముఖ హనుమాన్ విగ్రహ నిర్మాణ పనులను ఆదివారం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ ఠాకూర్ పరిశీలించారు. రాష్ట్రంలోనే అత్యాధునికమైన ఆధ్యాత్మిక కేంద్రంగా గుర్తించబడుతుందని అన్నారు.