● ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్
గోదావరిఖని: ఆపదలోని పేషెంట్లకు పునర్జన్మ ఇస్తున్న వైద్యులను గౌరవించాలని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ అన్నారు. వైద్యుల దినోత్సవం సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం వైద్యులతో కలిసి కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. డాక్టర్లను శా లువాలతో సన్మానించారు. అనంతరం ఆయన మా ట్లాడారు. ప్రజలకు ప్రాణం పోస్తున్న వైద్యులతో అనుచితంగా ప్రవర్తిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. వైద్యవృత్తి అనేది నిరంతర సేవా మార్గమని, మానవత్వాన్ని కాపాడే గొప్ప బాధ్యత డాక్టర్లది అని ఆయన అన్నారు. కార్యక్రమంలో మాజీ మేయర్ బంగి అనిల్‌కుమార్, వైద్యుల సంఘం నాయకులు క్యాస శ్రీనివాస్, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ పనులు ప్రారంభం
ఫెర్టిలైజర్‌సిటీ(రామగుండం): గౌతమినగర్ రైల్వే ట్రాక్ – ఎన్టీపీసీ సర్కిల్ వరకు రూ.2కోట్ల20 లక్షల వ్యయంతో చేపట్టిన సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ పనులను ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్ ప్రారంభించారు. ఈ మార్గంలో అనేక ప్రమాదాలు జరగడంతో వీధి దీపాలు ఏర్పాటు చేయాలని ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించింది. ఎట్టకేలకు బల్దియా అధికారులు సెంట్రల్ లైటింగ్ పనులు చేపట్టడంతో స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈసాలతక్కళ్లపల్లిలో
రూ.15కోట్లతో అభివృద్ధి పనులు
పాలకుర్తి(రామగుండం): ఈసాలతక్కళ్లపల్లిలో రూ.15కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ అన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు ఆయన ముగ్గు పోశారు. అనంతరం ఆయన మాట్లాడారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముక్కెర శ్రీనివాస్, నాయకులు మల్లెత్తుల శ్రీనివాస్, తుంగ నర్సయ్య, ఓడ్నాల రాజు, సాయితిరుమల్ తదితరులు పాల్గొన్నారు.