
యువతకు నైపుణ్య శిక్షణ
● టాస్క్ సెంటర్‌ను సద్వినియోగం చేసుకోండి ● కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ‘టాస్క్’ సెంటర్‌లో అందిస్తున్న నైపుణ్యశిక్షణను యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కో య శ్రీహర్ష సూచించారు. టాస్క్ సెంటర్‌లో టాలీ విత్ జీఎస్టీ కోర్సు పూర్తిచేసిన యువతకు ఆయన మంగళవారం సర్టిఫికెట్లు అందించారు. టాస్క్‌తో వివిధ రంగాల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ప్లేస్‌మెంట్ అవకాశాలు లభిస్తున్నాయని ఆయన తెలిపారు.
మిషన్‌భగీరథ పనుల్లో జాప్యమెందుకు?
పెండింగ్ మిషన్‌భగీరథ(ఇంట్రా) పనుల్లో జాప్య మెందుకు జరుగుతోందని కలెక్టర్ ప్రశ్నించారు. ఫిబ్రవరిలో మంజూరు చేసిన పనులు ఇంకా పూర్తికాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వారం రోజుల్లో ఇళ్లకు పైప్‌లైన్ వేసి తాగునీరు సరఫరా చేయాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా నీటి నాణ్యత పరీక్షలు చేయాలన్నారు. వాటర్ ట్యాంకులను శుభ్రం చేయించాలని, డ్రైనేజీల సమీపంలో తాగునీటి పైపులైన్ లీకేజీలు అరికట్టాలని, ప్రభుత్వ, రెసిడెన్షియల్ స్కూళ్లకు తాగునీరు సరఫరా చేయాలని పేర్కొన్నారు. డీపీవో వీరబుచ్చయ్య, మిషన్‌భగీరథ అధికారులు ఉన్నారు.
మంథని ఆస్పత్రిలో ప్రసవాలసంఖ్య పెంచాలి
మంథని ప్రభుత్వ ఆస్పత్రిలో సేవలు మెరుగుపడాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. ఆస్పత్రిలో 14మంది వైద్యసిబ్బంది ఉన్నా అందుబాటులో ఉండడం లేదనే ఫిర్యాదులొస్తున్నాయన్నారు. మంథని ఎంసీహెచ్‌లో ప్రసవాలు కనీసం 25 జరిగేలా చూ డాలని అన్నారు. సబ్‌సెంటర్ల వారీగా గర్భిణులను గుర్తించి ఎంసీహెచ్‌కు వచ్చేలా ప్రోత్సహించాలన్నా రు. సకాలంలో విధులకు హాజరుకావాలని ఆయన ఆదేశించారు. డీఎంహెచ్‌వో అన్న ప్రసన్నకుమారి, డీసీహెచ్‌వో శ్రీధర్ తదితరులు ఉన్నారు.