
హోంగార్డులకు రెయిన్‌కోట్లు
గోదావరిఖని: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని హోంగార్డులకు సీపీ అంబర్ కిశోర్ ఝా బుధవారం రెయిన్‌కోట్లు పంపిణీ చేశారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో విధి నిర్వహణలో ఇబ్బందులు పడకుండా రెయిన్‌కోట్స్ అందజేసినట్లు సీపీ పేర్కొన్నారు. వర్షాకాలంలో ట్రాఫిక్ నియంత్రణ, రాత్రి విధులు, బందోబస్తులో రెయిన్ కోట్లు సహాయపడుతాయని అన్నారు. కార్యక్రమంలో అడ్మిన్ అడిషనల్ డీసీపీ రాజు, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, హోంగార్డు ఆర్‌ఐ వామనమూర్తి పాల్గొన్నారు.
ట్రేడ్ లైసెన్స్ ఆదాయంపై దృష్టి
కోల్‌సిటీ(రామగుండం): ట్రేడ్ లైసెన్స్‌పై ఆదాయంపై బల్దియా అధికారులు ఫోకస్ పెట్టారు. నిర్వహణకు సాధారణ నిధులతోపాటు ఆస్తిప న్ను తర్వాత ట్రేడ్ లైసెన్స్‌ల ద్వారా వచ్చే ఆదాయంపైనే దృష్టి సారిస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో 3,036 వరకు అసెస్మెంట్లు ఉండగా, వీటిపై రూ.55.89లక్షల డిమాండ్ ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అసెస్మెంట్ల సంఖ్య 3,782 వరకు పెరిగింది. డిమాండ్ కూడా రూ.71.93లక్షలకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరాంతానికి ట్రేడ్‌లైసెన్స్ డిమాండ్ మొత్తంలో 72.16 శాతం వసూలు కాగా, ఈ ఆర్థిక సంవత్సరం త్రైమాసికంలోపే 50 శాతానికిపైగా వసూలు కావడం విశేషం. ప్రస్తుతం చేపట్టిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక ద్వారా డీ అండ్ వో ట్రేడ్ లైసెన్స్‌లపై ప్రత్యేక దృష్టి సారించిన అధికారులు.. వ్యాపారులకు అవగాహన కల్పిస్తున్నారు. ఏకకాలంలో కొత్తలైసెన్స్‌లూ జారీచేస్తున్నారు. ప్రతీవ్యాపార సంస్థను డీ అండ్ వో ట్రేడ్ లైసెన్స్ పరిధిలోకి తీసుకొచ్చి మెరుగైన ఆదాయం వచ్చేలా కృషి చేస్తున్నారు.
చురుగ్గా పనిచేయాలి
కోల్‌సిటీ(రామగుండం): మెప్మా సిబ్బంది చు రుగ్గా పనిచేయాలని రామగండం నగరపాలక సంస్థ కమిషనర్ అరుణశ్రీ సూచించారు. తన కార్యాలయంలో బుధవారం మెప్మా సిబ్బంది తో వివిధ అంశాలపై సమీక్షించారు. 100 రోజు ల కార్యాచరణ ప్రణాళిక లక్ష్యాన్ని నెరవేర్చాల ని, వీధి వ్యాపారుల కామన్ ఇంటరెస్ట్ గ్రూప్ లు, నూతన స్వయం సహాయక సంఘాలు, స్ల మ్ లెవెల్ ఫెడరేషన్‌లు ఏర్పాటు చేయాలన్నా రు. రుణాలను రికవరీలోనూ చొరవ తీసుకోవాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు త్వరితగతిన నిర్మాణం పూర్తిచేసుకోవడానికి బ్యాంకుల ద్వారా ఆర్థిక సహకారం అందేలా చూడాలన్నారు. ఇందిరమ్మ మోడల్ కాలనీ నిర్మించడానికి అనువుగా ఉండే ప్రాంతాలను గుర్తించి సమాచారం ఇవ్వాలని సూచించారు. డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రామన్, మెప్మా టీఎంసీ మౌనిక, సీవోలు, ఆర్పీలు పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధులపై అప్రమత్తం
గోదావరిఖని: సీజనల్ వ్యాధులపై కార్మిక కుటుంబాలు అప్రమత్తంగా ఉండాలని సింగరేణి ఏరియా ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ పద్మ కోరారు. బుధవారం ఆర్జీ–1 ఏరియాలోని జీడీకే–5 ఓసీపీపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. ప్రతీఒక్కరు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, దోమలు రాకుండా జాగ్రత్త పడాలని, కలుషిత ఆహారం తీసుకోవద్దని, కలుషిత నీటిని తాగవద్దని ఆమె సూచించారు. నీటిని మరిగించి చల్లారాక వడిపోసి తాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గని మేనేజర్ అనిల్‌గబాలే, రక్షణాధికారి రాములు, ఇంజినీర్ వేణుగోపాల్, సీనియర్ సర్వే ఆఫీసర్ చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.
అరుణాచలానికి ఆర్టీసీ బస్సు
మంథని: ఆషాఢ శుక్ల పౌర్ణమి(గురుపౌర్ణమి) సందర్భంగ అరుణాచల గిరి ప్రదక్షిణకు మంథని డిపో నుంచి ఈనెల 8న సూపర్ లగ్జరీ బ స్సు బయలు దేరుతుందని డీఎం శ్రావణ్‌కుమార్ తెలిపారు. పెద్దపల్లి, కరీంనగర్, హైదరాబాద్ నుంచి వెళ్లే బస్సు కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనం తర్వాత ఈనెల 9న రాత్రి అరుణాచలం చేరుకుంటుందన్నారు. ప్రదక్షిణ అ నంతరం సాయంత్రం అరుణాచలంలో బస్సు బయలుదేరి ఈనెల 11న గద్వాల జోగులాంబ టెంపుల్‌కు చేరుకుంటుందని పేర్కొన్నారు. అమ్మవారి దర్శనం అనంతరం గద్వాలలో బయలుదేరి హైదరాబాద్, కరీంనగర్, పెద్దపల్లి నుంచి మంథనికి చేరుకుంటుందన్నారు. మంథని నుంచి పెద్దలకు రూ.5,040, పిల్లలకు రూ.3,790, పెద్దపల్లి నుంచి పెద్దలకు రూ.4,940, పిల్లలకు రూ.3,720 చార్జీ ఉంటుందని పేర్కొన్నారు. అడ్వాన్స్ బుకింగ్ కోసం 99592 25923, 94913 24172 నంబర్లలో సంప్రదించాలని డీఎం కోరారు.