నరికినా బతికేస్తా | - | Sakshi
Sakshi News home page

నరికినా బతికేస్తా

Jul 5 2025 6:48 AM | Updated on Jul 5 2025 6:48 AM

నరికినా బతికేస్తా

నరికినా బతికేస్తా

చావు వరకు వెళ్లి ప్రాణం పోసుకుంటోంది ఈ చెట్టు. దీన్ని నరికిన వ్యక్తి చూస్తే.. ఎందుకు నరికానా అని కన్నీళ్లు పెట్టుకునేలా.. ఆ నరికిన చేతులే తిరిగి దండం పెట్టేలా.. మొక్కవోని ధైర్యంతో కొత్త చిగురుతో పురుడు పోసుకుంటుంది. పచ్చని ప్రకృతి ఒడిలో కొత్తగా చిగురిస్తున్న ఆశల ఆనందం వెనుక కానరాని ఆటుపోట్లు ఆ చిగురుకే తెలియాలి. ఏ మాత్రం అవకాశమున్నా బతికేస్తా అంటూ ప్రాణకోటి జీవరాశులకు అద్దం పడుతోంది. బంధాలు మరిచి ఒకరినొకరు చంపుకుంటున్న మనుషులే.. తనను చంపినా నేను చావనంటూ మనిషి జీవితానికి అర్థాన్ని చెబుతోంది. ఓ రైతు వ్యవసాయ క్షేత్రం వద్ద మొండెం వరకు నరికి వదిలేసిన ఈ చెట్టు మళ్లీ చిగురిస్తూ వచ్చిపోయేవారికి జీవిత సారాంశాన్ని నేర్పిస్తోంది. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామ శివారులో ‘సాక్షి’ కెమెరాకు చిక్కింది

ఈ చిత్రం.

– సాక్షి ఫొటోగ్రాఫర్‌, పెద్దపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement