రామగుండం | - | Sakshi
Sakshi News home page

రామగుండం

Jul 5 2025 6:48 AM | Updated on Jul 5 2025 6:48 AM

రామగుండం

రామగుండం

60
డివిజన్ల
● మాయమైన పాత డివిజన్ల ముఖచిత్రం ● డివిజన్ల వారీగా ఇంటి నంబర్లతో కాలనీలు ● హద్దులపై వీడిన అయోమయం

కోల్‌సిటీ(రామగుండం): నగరపాలక సంస్థలో కొత్తగా ఏర్పడిన 60 డివిజన్లతో రామగుండం బల్దియా రూపురేఖలు మారిపోయాయి. విలీనమైన లింగాపూర్‌, వెంకట్రావుపల్లి, ఎల్కలపల్లిగేట్‌, అక్బర్‌నగర్‌ గ్రామాలను కలిపి 60 డివిజన్లుగా పునర్విభజన చేస్తూ హద్దులతో కూడిన తుది జాబితాను విడుదల చేశారు. ఇప్పటి వరకు ఉన్న పాత 50 డివిజన్ల ముఖచిత్రం మాయమైంది. ఇటీవల సీడీఎంఏ నుంచి జారీ అయిన 60 డివిజన్ల పునర్విభజన తుది జాబితాలో కేవలం హద్దులు మాత్రమే ఉండడంతో, ఏ డివిజన్‌లోని ఏయే కాలనీలు వస్తాయో..? ఏ ఇంటి నంబర్‌ నుంచి ఏయే ఇంటి నంబర్ల వరకు వస్తున్నాయో అర్థంకాక మాజీ కార్పొరేటర్లతోపాటు ఆశావహులు తికమకపడ్డారు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం 30 మంది వార్డు ఆఫీసర్లకు 60 డివిజన్లను కేటాయిస్తూ అధికారులు కొత్త డివిజన్ల పూర్తి జాబితాను అందజేశారు. దీంతో ఈ జాబి తాతో డివిజన్లపై ఇప్పటి ఉన్న అయోమయం వీడింది. ఉత్తరం నుంచి తూర్పు, దక్షిణం, పడమర, తిరి గి ఉత్తరానికి సంబంధించిన డివిజన్ల హద్దుల ప్రకా రం ఇంటి నంబర్లు, కాలనీలను పొందుపరిచారు.

కొత్త డివిజన్లలో కాలనీలు ఇలా..

● ఒకటో డివిజన్‌లో ఇందిరమ్మకాలనీ, పీకేరామయ్యకాలనీ, మేడిపల్లి విలేజ్‌ పరిధి వరకు. రెండో డివిజన్‌లో న్యూపోరట్‌పల్లి, జంగాలపల్లి, శాలపల్లి, కృష్ణానగర్‌. 3వ డివిజన్‌లో నర్రశాలపల్లి, మల్కాపురం, పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌, శ్రీనగర్‌కాలనీ, ప్రశాంత్‌నగర్‌. 4వ డివిజన్‌లో పవర్‌హౌస్‌కాలనీ, ఐదో డివిజన్‌లో గంగానగర్‌ మిలీనియం క్వార్టర్స్‌. ఆరో డివిజన్‌లో జనగామ. 7వ డివిజన్‌లో జీఎం కాలనీలో టీ–2 క్వార్టర్లలో కొంత భాగం, ఐబీ కాలనీలో (1–385) కొంత భాగం. 8వ డివిజన్‌లో సీఎస్పీ కాలనీ, బాపూజీనగర్‌, ప్రియాంకానగర్‌. 9వ డివిజన్‌లో సూర్యానగర్‌, విద్యానగర్‌, లెనిన్‌నగర్‌.

● 10వ డివిజన్‌లో రాంనగర్‌లో కొంత భాగం, మల్లికార్జున్‌నగర్‌, సీతానగర్‌. 11వ డివిజన్‌లో

● రాంనగర్‌లో కొంత భాగం, భరత్‌నగర్‌, సంజయ్‌నగర్‌, ఫైవింక్లయిన్‌ చౌరస్తా, పరుశరాంనగర్‌. 12వ డివిజన్‌లో విఠల్‌నగర్‌ కొంత భాగం. 13వ డివిజన్‌లో

● విఠల్‌నగర్‌ కొంత భాగం. 14వ డివిజన్‌లో లంబాడీతండా, సింగరేణి స్కూల్‌ వెనకసైడ్‌, తారకరామనగర్‌, భాస్కర్‌రావు నగర్‌. 15వ డివిజన్‌లో షాపింగ్‌ కాంప్లెక్స్‌, పోలీస్‌ క్వార్టర్లు, కేకే నగర్‌, కుమారస్వామినగర్‌, వెంకటరావుపల్లి. 16వ డివిజన్‌లో షిర్కే బస్‌స్టాప్‌ ఏరియా, ఇటాలియ్‌ విగ్రహం నుంచి అబ్దుల్‌కలాం స్టేడియం క్వార్టర్లు. 17వ డివిజన్‌లో సింగరేణి క్వార్టర్లు, షిర్కే బస్టాప్‌ ఏరియా, అబ్దుల్‌కలాం స్టేడియం వెనుక క్వార్టర్లు, సంతోష్‌నగర్‌. 18వ డివిజన్‌లో 8వ కాలనీలోని హనుమాన్‌నగర్‌ సీఈఆర్‌ క్లబ్‌ ఎదురు, హనుమాన్‌ టెంపుల్‌ వెనుక క్వార్టర్లు. 19వ డివిజన్‌లో అల్లూరు, సంతోష్‌నగర్‌.

● 20వ డివిజన్‌లో న్యూమారేడుపాక, రెడ్డికాలనీ, పోతనకాలనీ, గోపాల్‌నగర్‌. 21వ డివిజన్‌లో లక్ష్మీపురం, వీర్లపల్లి, ఎఫ్‌సీఐ ఎల్కపల్లి గేట్‌(జీపీ). 22వ డివిజన్‌లో గౌతమినగర్‌, చైతణ్యపురికాలనీ, ఎఫ్‌సీఐ క్వార్టర్లు, ఎల్కపల్లిగేట్‌. 23వ డివిజన్‌లో గౌతమినగర్‌, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌కాలనీ, ప్రగతినగర్‌, మాతంగికాలనీ, శాంతినగర్‌, కాజిపల్లి. 24వ డివిజన్‌లో ఎన్టీపీసీ టీటీఎస్‌, ఎఫ్‌సీఐ ఎక్స్‌రోడ్‌, ఎన్టీపీసీ పీటీఎస్‌. 25వ డివిజన్‌లో మల్యాలపల్లి, జీరో పాయింట్‌, పోస్ట్‌ ఆఫీస్‌ బ్యాక్‌సైడ్‌, రైల్వే అండర్‌పాస్‌. 26వ డివిజన్‌లో అక్బర్‌నగర్‌, ఎస్టీ కాలనీ, రైల్వేక్వార్టర్లు. 27వ డివిజన్‌లో విద్యుత్‌నగర్‌, సబ్‌స్టేషన్‌ ఏరియా, అంబేడ్కర్‌నగర్‌, ముబారక్‌నగర్‌. 28వ డివిజన్‌లో విలేజ్‌ రామగుండం, పాములపేట, రామాలయం టెంపుల్‌ ఎదురుగా, పాతబజార్‌. 29వ డివిజన్‌లో లింగాపూర్‌, ఈఎస్‌ఐ ఆస్పత్రి ఏరియా, హౌజింగ్‌బోర్డుకాలనీ.

● 30వ డివిజన్‌లో అయోధ్యనగర్‌, రామాలయం ఏరియా. 31వ డివిజన్‌లో క్రషర్‌నగర్‌, సుభాష్‌నగర్‌, ఆటోనగర్‌, భీమునిపట్నం కొంతభాగం. 32వ డివిజన్‌లో మేడిపల్లిసెంటర్‌, భీమునిపట్నంలో కొంత భాగం. 33వ డివిజన్‌లో అన్నపూర్ణకాలనీ, అంబేడ్కర్‌నగర్‌, మేరకాలనీ. 34వ డివిజన్‌లో కృష్ణానగర్‌. 35వ డివిజన్‌లో సప్తగిరికాలనీ, ఐబీకాలనీ కొంత భాగం, రాజ్యలక్ష్మికాలనీ. 36వ డివిజన్‌లో బస్టాండ్‌కాలనీ, జైభీంనగర్‌, గాంధీనగర్‌. 37వ డివిజన్‌లో హనుమాన్‌నగర్‌లో కొంతభాగం, గాంధీనగర్‌లో కొంతభాగం. 38వ డివిజన్‌లో హనుమాన్‌నగర్‌ కొంతభాగం, అంబేడ్కర్‌నగర్‌, సీతానగర్‌. 39వ డివిజన్‌లో శివాజీనగర్‌, లక్ష్మీనగర్‌, అశోక్‌నగర్‌.

● 40వ డివిజన్‌లో ఎల్బీనగర్‌, మేదరిబస్తీ, కళ్యాణ్‌నగర్‌. 41వ డివిజన్‌లో ఎల్బీనగర్‌ కొంతభాగం. 42వ డివిజన్‌లో జవహర్‌నగర్‌, తిలక్‌నగర్‌ కొంతభాగం. 43వ డివిజన్‌లో

● ఫైవింక్లయిన్‌ ఏరియా, జవహర్‌నగర్‌. 44వ డివిజన్‌లో 7బీకాలనీ, ఎన్‌సీ క్వార్టర్లు, సిక్‌ హాస్పిటల్‌, క్రషర్‌ ఏరియా. 45వ డివిజన్‌లో చంద్రశేఖర్‌నగర్‌. 46వ డివిజన్‌లో రాజీవ్‌నగర్‌ కొంతభాగం, సంజయ్‌గాంధీనగర్‌, ఇందిరానగర్‌. 47వ డివిజన్‌లో శివనగర్‌, కృష్ణాటెంపుల్‌, వెంకటేశ్వరకాలనీ, దుర్గానగర్‌, లూర్దునగర్‌, శాంతినగర్‌ కొంతభాగం. 48వ డివిజన్‌లో కేసీఆర్‌కాలనీ, చంద్రబాబుకాలనీ, ఆర్టీసీకాలనీ, సాయినగర్‌, ప్రగతికాలనీ, పద్మావతికాలనీ. 49వ డివిజన్‌లో ఎల్లందు గెస్ట్‌హౌజ్‌, మార్కండేయకాలనీ, శారదానగర్‌ (సింగరేణి క్వార్టర్లు), బృందావన్‌కాలనీ, సిద్ధి వినాయకనగర్‌, కేశవకాలనీ, పద్మావతి కాలనీ(అపార్‌మ్మెంట్స్‌).

● 50వ డివిజన్‌లో అశోకనగర్‌, గాంధీనగర్‌ కొంత భాగం. 51వ డివిజన్‌లో లక్ష్మీనగర్‌, అశోకనగర్‌. 52వ డివిజన్‌లో కళ్యాణ్‌నగర్‌, అడ్డగుంటపల్లి కొంతభాగం. 53వ డివిజన్‌లో ఎల్బీనగర్‌ కొంతభాగం, తిరుమల్‌నగర్‌. 54వ డివిజన్‌లో రమేశ్‌నగర్‌, జవహర్‌నగర్‌. 55వ డివిజన్‌లో తిలక్‌నగర్‌, తిలక్‌నగర్‌డౌన్‌. 56వ డివిజన్‌లో తిలక్‌నగర్‌ కొంతభాగం, రమేశ్‌నగర్‌, ద్వారకనగర్‌ కొంత భాగం. 57వ డివిజన్‌లో ద్వారకానగర్‌ కొంతభాగం, ఎన్టీఆర్‌నగర్‌, కాకతీయనగర్‌. 58వ డివిజన్‌లో అడ్డంగుంటపల్లి. 59వ డివిజన్‌లో మార్కండేయకాలనీ, అశోకనగర్‌. 60వ డివిజన్‌లో మారుతినగర్‌, అడ్డగుంటపల్లి, లక్ష్మీనగర్‌, కళ్యాణ్‌నగర్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement