
కష్టపడి చదివి ఉన్నతంగా ఎదగాలి
పెద్దపల్లిరూరల్: విద్యార్థులు కష్టపడి చదివి జీవితంలో ఉన్నతంగా స్థిరపడాలని పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ అన్నారు. శుక్రవారం పెద్దపల్లిలోని మహాత్మజ్యోతిబా పూలే విద్యాలయం విద్యార్థులకు మత్తుపదార్థాల వల్ల కలిగే అనర్థాలు, సైబర్‌నేరాలపై అవగాహన కల్పించారు. తాను కూడా గురుకులంలోనే చదివి ఈ స్థాయిలో ఉన్నానని గుర్తు చేసుకున్నారు. ఇంటర్నెట్ చేతిలో ఉంటే ప్రపంచమంతా ముందున్నట్టే అనిపిస్తోందని, అయితే అందులో మంచి, చెడు తెలుసుకుని మంచిని స్వీకరిస్తేనే భవిష్యత్తు బాగుంటుందన్నారు. జిల్లా వ్యాప్తంగా బాలికలే ఫలితాల్లో ముందువరసలో ఉన్నారన్నారు. ఎస్సై లక్ష్మణ్‌రావు, కాలేజీ ఆర్‌సీవో అంజలి, ప్రిన్సిపాల్ మణిదీప్తి, నశాముక్త్ భారత్ కమ్యూనిటీ ఎడ్యుకేటర్ శ్యామల, సిబ్బంది పాల్గొన్నారు.