
అమ్మకాలు జరగడం లేదు
ప్లాట్ల క్రయ, విక్రయాలు లేక రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేసేవారిపై ఆర్థిక ప్రభావం చూపుతోంది. ప్లాట్ల వ్యాపారం జరిగే సమయంలో పెద్దపల్లిలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోవడం కూడా తమకు నష్టం కలిగించింది. తర్వాత పునఃప్రారంభించినా రిజిస్ట్రేషన్ చార్జీలు పెరగడం, ప్రజల వద్ద కొనుగోలు శక్తి లేక రియల్ వ్యాపారం తగ్గింది. మళ్లీ పుంజుకుంటుందనే ఆశతో ఉన్నాం.
– పెగడ రమేశ్‌యాదవ్,
రియల్టర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు
ఆదాయంపై ప్రభావం
పెద్దపల్లి ప్రాంతంలో భూ లావాదేవీలు గణనీయంగా తగ్గిపోయాయి. దీంతో తమ కార్యాలయానికి ఏటా సమకూరే ఆదాయం దాదాపు రూ.6కోట్ల మేర తగ్గింది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ విధానంలో వచ్చిన మార్పులతో సమయం ఎంతో ఆదా అవుతోంది.
– అశోక్, సబ్‌రిజిస్ట్రార్, పెద్దపల్లి

అమ్మకాలు జరగడం లేదు