
కార్మిక సంక్షేమమే ధ్యేయంగా ముందుకు
● మంత్రి వివేక్
గోదావరిఖని(రామగుండం): కార్మిక సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతామని రాష్ట్ర కార్మిక ఉపాధి, శిక్షణ, పరిశ్రమలు, భూగర్భగనుల శాఖ మంత్రి గడ్డం వివేక్‌వెంకటస్వామి పేర్కొన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆదివారం గోదావరిఖనికి వచ్చిన సందర్భంగా మంత్రికి ఘన స్వాగతం పలికి, స్థానిక ఓ ఫంక్షన్‌హాల్‌లో సన్మానించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సింగరేణి కార్మికులకు పెన్షన్ ఇప్పించిన ఘనత కాకా వెంకటస్వామిదే అన్నారు. కాకా బాటలోనే ఎంపీ వంశీకృష్ణ కార్మికుల సమస్యలపై పార్లమెంట్‌లో గళం విప్పారని పేర్కొన్నారు. కార్మికుల సొంతింటి కల నెరవేరేలా కృషి చేస్తామని, ఔట్‌సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రామగుండంలో జరిగే ఇసుకదందాను బంద్ చేస్తామని చెప్పారు. ఏటా రూ.3వేల కోట్ల ఆదాయం ఇసుకపై వస్తుండగా, అందులో ప్రస్తుతం రూ.400కోట్లు మాత్రమే వస్తోందని, మిగతాది ఎటుపోతోందని ప్రశ్నించారు. దీనిపై ముఖ్యమంత్రి సీరియన్‌గా ఉన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ అధ్యక్షుడు, ఐఎన్‌టీటీయూ జాతీయ నాయకుడు బాబర్‌సలీంపాషా, మాల మహానాడు సంఘం నాయకులు గుమ్మడి కుమారస్వామి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.