
సమ్మెతోనే కార్మిక హక్కులు సాధ్యం..
సమ్మెతో కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తాం. లేబర్‌కోడ్‌లను రద్దు చేసి గతంలో మాదిరిగా కార్మిక చట్టాలను కొనసాగించాలి. కార్మికులంతా స్వచ్ఛందంగా విధులు బహిష్కరించి మద్దతివ్వాలి. కేంద్రం తీరుతో సింగరేణి పెద్దమొత్తంలో నష్టపోయింది.
– సీతారామయ్య, ఏఐటీయూసీ అధ్యక్షుడు
లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి
కార్మిక చట్టాలను గతంలో ఉన్న వాటినే కొనసాగించాలి. లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలి. అమలు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం. బొగ్గు గనుల ప్రైవేటీకరణ మానుకోవాలి. సింగరేణి సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది.
– తుమ్మల రాజారెడ్డి, సీఐటీయూ అధ్యక్షుడు
బొగ్గు బ్లాకులు కేటాయించాలి
సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలి. లేబర్ కోడ్‌లు అమలు చేయడం వల్ల కార్మి కులకు తీరని నష్టం కలుగుతుంది. బొగ్గుబ్లాక్‌లు ప్రైవేట్‌పరం చేయడాన్ని కార్మిక సంఘాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. కొత్తబ్లాక్‌లు సింగరేణికే అప్పగించాలి.
– రియాజ్ అహ్మద్, హెచ్‌ఎంఎస్ అధ్యక్షుడు

సమ్మెతోనే కార్మిక హక్కులు సాధ్యం..

సమ్మెతోనే కార్మిక హక్కులు సాధ్యం..