
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
● కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లిరూరల్: జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనుల వేగం పెంచాలని కలెక్టర్ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం ఆర్‌అండ్‌బీ, టీజీఈడబ్ల్యూయూఐడీసీ పనులపై సమీక్ష నిర్వహించారు. డీఎంఎఫ్‌టీ ఇతర నిధులతో చేపట్టిన వంతెనలు, రోడ్లు, ఆసుపత్రి, పాఠశాల భవనాలు, ఇతర అభివృద్ధి పనులు ఆరాతీశారు. సమావేశంలో ఈఈ బావ్‌సింగ్ తదితరులున్నారు.
15లోగా దరఖాస్తు చేసుకోవాలి
ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుల నియామకానికి ఈనెల 15లోగా దరఖాస్తు చేసుకో వాలని కలెక్టర్ సూచించారు. జిల్లాస్థాయి విజిలెన్స్ కమిటీ, మానిటరింగ్ కమిటీలో ఐదుగురు సభ్యుల నియామకం కొరకు ఎస్సీ, ఎస్టీకి చెందినవారు, ముగ్గురు నాన్‌అఫిషియల్ సభ్యులు స్వచ్ఛంద సంస్థలవారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని,ఆసక్తిగల వారు షెడ్యూల్డ్‌కులాల అభివృద్ధి అధికారి కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు.
పీఎం కుసుమ్ పథకం కింద సోలార్‌ప్లాంటు
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కుసుమ్ కింద సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుని నెలనెలా ఆదాయం పొందాలని కలెక్టర్ శ్రీహర్ష అ న్నారు. కలెక్టరేట్‌లో సోమవారం సంబంధిత అ ధికారులతో సమీక్షించారు. రైతులు, సహకారసంఘాలు వారి భూముల్లో 500కిలోవాట్ల నుంచి 2మెగావాట్ల వరకు సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు ఏ ర్పాటు చేసుకుని ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను అ మ్మడం ద్వారా నెలవారీ ఆదాయం పొందొచ్చన్నా రు. జిల్లాలో 4 సహకారసంఘాలు ప్లాంట్ల ఏర్పాటుకు ఒప్పందం చేసుకున్నాయని వివరించారు.
ఇంటి యజమానుల కోసం ‘సూర్యఘర్’
సూర్యఘర్ ముప్తిబిజిలీ యోజన కింద ఇళ్ల పైకప్పు పై సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసేలా ప్రోత్సహించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఒకే కాలనీలో లబ్ధిదారులు ఏర్పాటుకు ముందుకొస్తే అదనంగా రూ.10వేల రాయితీని అందిస్తామన్నారు. ఈనెలాఖరు వరకు ఆసక్తిగల లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలన్నారు. ఆర్డీవో గంగయ్య, డీసీవో శ్రీమాల తదితరులున్నారు.