
నలుగురికి మేలు జరగాలని..
కోరుట్లటౌన్: ‘మనం చచ్చినా, బతికినా నలుగురికి మేలు జరగాలి. అదే చిన్ననాటి నుంచి ఆశయం. టీచర్ ఉద్యోగం వచ్చినప్పటి నుంచి పది మందికి సాయం చేయాలనే తపనతో కొనసాగిన. రిటైర్డ్ అయ్యాక సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తున్న. ఆఖరికి చనిపోయినా నలుగురికి ఉపయోగపడాలి’. అని అంటున్నాడు కోరుట్లకు చెందిన రిటైర్డ్ టీచర్ వోటారికారి చిన్నరాజన్న. మరణానంతరం అవయవదానం చేయాలన్న ఉద్దేశంతో పదేళ్ల క్రితం సదాశయ ఫౌండేషన్ నిర్వాహకులను సంప్రదించి అంగీకారపత్రం తీసుకున్నారు. అవయవదాతలు పునర్జన్మ ఇచ్చినవారవుతారని పేర్కొన్నారు.
– చిన్నరాజన్న