
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
● ఎమ్మెల్యే విజయరమణారావు
ఎలిగేడు(పెద్దపల్లి): అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. సోమవారం మండలంలోని ముప్పిరితోటలో ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గులు పోసి 22 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. సీఆర్‌ఆర్(ఎన్‌సీపీ) నిధులు రూ.10లక్షలతో ఎస్సీకాలనీలో సీసీరోడ్డు, ఎస్‌డీఎఫ్ నిధులు రూ.5లక్షలతో సీసీ సైడ్‌డ్రైన్ పనులు ప్రా రంభించారు. అలాగే పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వనమహోత్సవంలో మొ క్కలు నాటారు. విండో చైర్మన్ గోపు విజయభా స్కర్‌రెడ్డి, నాబార్డు డీడీఎం జయప్రకాశ్, సహకార బ్యాంకు కరీంనగర్ సీఈవో సత్యనారాయణరావు, డీసీవో శ్రీమాల, తహసీల్దార్ యాక న్న, ఎంపీడీవో భాస్కర్‌రావు పాల్గొన్నారు.