
బలహీనవర్గాల సేవలో నిమగ్నమవుతా
● ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
ధర్మారం(ధర్మపురి): మంత్రి పదవి దేవుడిచ్చిన వరంలాంటిదని, బడుగు, బలహీనవర్గాల సేవలో నిమగ్నమవుతానని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. ఆదివారం ధర్మారం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో రాష్ట్ర గురుకులాల మెస్ కాంట్రాక్టు అసోసియేషన్, ఆర్‌ఎంపీ వైద్యుల అసోసియేషన్ మండల అధ్యక్షుడు మునీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో మంత్రిని సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన 24 గంటల్లోనే గురుకులాల పెండింగ్ బిల్లులను ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రులతో మాట్లాడి మంజూరు చేయించానని చెప్పారు. వసతిగృహాల్లో ఉంటూ చదువుకుంటున్న పేద విద్యార్థుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం డైట్ చార్జీలు పెంచిందని, దీంతో రాష్ట్రంలోని లక్షా 35వేల మంది విద్యార్థులకు సరిపడా డైట్ అందుతోందన్నారు. బీఆర్‌ఎస్ పదేళ్లు అధికారంలో ఉండి డైట్ చార్జీలు పెంచలేదని, గురుకులం మెస్ కాంట్రాక్టర్‌లకు బిల్లులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. గురుకుల విద్యాలయాల్లో నిర్వహించే టెండర్ విధానంపై సంబంధిత కార్యదర్శితో చర్చిస్తానని పేర్కొన్నారు. రాష్ట్ర గురుకులాల మెస్ అసోసియేషన్ అధ్యక్షుడు నర్సింగరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ లావుడ్య రూప్లానాయక్, పార్టీ మండల అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.