
నిబంధనలు పాటించాలి
● కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లిరూరల్: జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో రోడ్ సేఫ్టీ నిబంధనలు కచ్చితంగా అమలు చేసేలా అధికారయంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ, డీసీపీ కరుణాకర్‌తో కలిసి సమీక్షించారు. వాహనదారులు నిబంధనలు పాటించాలన్నారు. ఉల్లంఘించే వారిని గుర్తించి చర్యలు చేపట్టేందుకు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద సీసీ కెమెరాలతో నిఘా పెంచాలన్నారు.
సీఎంఆర్‌ఎఫ్‌లో ‘ఫేక్’ దరఖాస్తులు
జిల్లానుంచి ఉన్నతాధికారులకు అందిన సీఎంఆర్‌ఎఫ్ దరఖాస్తుల్లో ఫేక్ దరఖాస్తులు ఉన్నట్టు హైదరాబాద్ అధికారులు అనుమానించారని కలెక్టర్ పేర్కొన్నారు. సదరు దరఖాస్తులను వెరిఫై చేయాలంటూ ఆదేశాలందాయని వివరించారు. ఇందుకు పోలీసు శాఖ అధికారుల సహకారంతో ముందుకు సాగాలని సూచించారు.
పాఠశాలల్లో ఆత్మీయతాభావం పెంచాలి
జిల్లాలోని పాఠశాలల్లో ఆత్మీయతాభావం పెంపొందించడమే లక్ష్యంగా ప్రాజెక్టుశక్తి కార్యక్రమాన్ని అమలు చేయాలని కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షించారు. విద్యార్థుల్లో సమానత్వం పెంపొందించాలన్నారు. ఆర్డీవో గంగయ్య, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్, ఆర్టీవో రంగారావు, డీఈవో మాధవి తదితరులున్నారు.