
అప్రమత్తంగా ఉండాలి
జూలపల్లి(పెద్దపల్లి): సీజనల్ వ్యాధుల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో, సీజనల్ వ్యాధుల నియంత్రణ ప్రోగ్రాం అధికారి శ్రీరాములు సూచించారు. శుక్రవారం మండలంలోని పెద్దాపూర్‌లో డ్రై డే,ఫ్రై డే కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం జూలపల్లి పీహెచ్‌సీని సందర్శించారు. వైద్యాధికారి సంపత్‌రెడి తదితరులు ఉన్నారు.
వివేకానందుని ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలి
జ్యోతినగర్(రామగుండం): అంతర్జాతీయ వేదికలపై భారతీయ తత్వాన్ని చాటిన మహోన్నత ఆధ్యాత్మికవేత్త స్వామివివేకానంద అని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామచందర్ అన్నారు. శుక్రవారం జాతీయ యువజన అవార్డు గ్రహీత ఈదునూరి శంకర్ ఆధ్వర్యంలో ఎన్టీపీసీ రామగుండం పీటీఎస్ జ్యోతిభవన్‌లో జరిగిన వివేకానంద వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని నివాళి అర్పించారు. దొంతుల శ్రీనివాస్, ఈదునూరి తదితరులు పాల్గొన్నారు.
కరపత్రం ఆవిష్కరణ
గోదావరిఖనిటౌన్(రామగుండం): ఆషాఢమా సం సందర్భంగా గోదావరిఖని నుంచి పలు పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక టూర్స్ ప్యాకేజీ కరపత్రాలను రామగుండం మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ సంతోష్‌రెడ్డి, డిపో మేనేజర్ నాగభూషణం శుక్రవారం ఆవిష్కరించారు. అరుణాచలం, శ్రీశైలం, జోగులాంబ, కాణిపాకం, యాదగిరిగుట్ట, స్వర్ణగిరి, విజయవాడ, అన్నవరం, సింహాచలం, చిలుకూరు బాలాజీ ఆలయాలకు 4 సూపర్ లగ్జరీ ఏసీ బస్సులను నడుపుతున్నట్టు డీఎం తెలిపారు.
మా భూములిస్తే బతికేదెట్లా?
రామగిరి(మంథని): ‘జీవనాధారమైన మా భూముల్లో ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటు చేయొద్దు’ అంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మండలంలోని రత్నాపూర్ గ్రామంలోని మేడిపల్లి శివారులో సుమారు 209 ఎకరాల భూ సేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయగా, శుక్రవారం సర్వేకు వచ్చిన అధికారులను అడ్డుకున్నారు. వ్యవసాయాన్ని నమ్ముకునే జీవిస్తున్న తాము భూములు కోల్పోతే తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ సభ ఏర్పాటు చేయకుండా భూములను తీసుకుంటే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. రైతులు, గ్రామస్తులు కొండు లక్ష్మణ్, భద్రపు కృష్ణమూర్తి తదితరలున్నారు.
జలపాతం వైపు రావొద్దు
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం సబ్బితం సమీపంలోని గౌరీగుండాల జలపాతం వైపు రావొద్దంటూ పెద్దపల్లి రూరల్ పోలీసులు శుక్రవారం ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. సబ్బితం ప్రధానరోడ్డు నుంచి జలపాతం వైపు వెళ్లే రోడ్డుకు అడ్డంగా బారికేడ్లను కూడా ఏర్పాటు చేశారు. జలపాతం వద్ద జాలువారే అందాలను వీక్షిస్తూ గతంలో ఎందరో యువకులు ప్రాణాలు కోల్పోయారని, ఆ కారణంగానే ఎవరినీ అనుమతించడం లేదని ఎస్సై మల్లేశ్ తెలిపారు.
ముగిసిన మహిళా రెస్క్యూ సభ్యుల శిక్షణ
గోదావరిఖని(రామగుండం): రెండు వారాలపాటు ఆర్జీ–2 ఏరియా మెయిన్ రెస్క్యూ స్టేషన్‌లో కొనసాగిన మహిళా రెస్క్యూ సభ్యుల శిక్షణ శుక్రవారంతో ముగిసింది. మహిళా సభ్యులకు సర్టిఫికెట్లు, డ్రెస్‌కోడ్‌లు అందించారు. రెస్క్యూ జీఎం కె.శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ మహిళా రెస్క్యూ సభ్యులకు సంస్థ చరిత్రలో మొదటిసారిగా శిక్షణ ఇచ్చామని తెలిపారు. విధినిర్వహణలో శిక్షణ ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు. రెస్క్యూ సూపరింటెండెంట్ రాజేందర్‌రెడ్డి, ఇన్‌స్ట్రక్టర్లు తిరుపతి, మూర్తి, టైనర్లు కిషన్‌రావు, రెస్క్యూ సిబ్బంది పాల్గొన్నారు.

అప్రమత్తంగా ఉండాలి

అప్రమత్తంగా ఉండాలి

అప్రమత్తంగా ఉండాలి